Viral Video: ఇది మాములు క్రియేటివిటీ కాదు భయ్యో.. నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: ఇది మాములు క్రియేటివిటీ కాదు భయ్యో.. నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోన్న వీడియో..!
x
Highlights

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్‌ సెలబ్రిటీగా మారిపోతున్నారు.

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్‌ సెలబ్రిటీగా మారిపోతున్నారు. తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొందరు పాటలు పాడుతూ వైరల్‌ అవుతుంటే మరికొందరు డ్యాన్స్‌ చేస్తూ ట్రెండ్‌ అవుతున్నారు. రకరకలా వీడియోలను రూపొందిస్తూ ఎంచక్కా ఫేమ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడు మాత్రం తనలోని యానిమేషన్‌ ట్యాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడయాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఓ యువకుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అయితే కింద పెద్ద కొండ చిలువ ఉంది. ఆ యువకుడిని అమాంతం మింగేద్దాం అన్నట్లు ప్రయత్నిస్తుంది. పెద్దగా నోరు తెరుస్తూ పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ యువకుడు మాత్రం ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఇంకొంచెం పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

అయితే ఇదంతా నిజం అనుకుంటే పొరబడినట్లే. యానిమేషన్‌ మాయతో యువకుడు చేసిన మ్యాజిక్‌ ఇది. నిజానికి అక్కడ ఎలాంటి పాము లేదు. అదంతా గ్రాఫిక్స్‌లో చేసిందే. ఆ విషయం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఈ వీడియోను యూట్యూబ్‌లో షార్ట్స్‌ రూపంలో పోస్ట్‌ చేయగా ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా 45 వేల మంది లైక్‌ చేయగా 1300 మందికిపైగా కామెంట్స్ చేశారు. వీరిలో చాలా మంది 'కెమెరామెన్‌ అతన్ని కాపాడకుండా ఏం చేస్తున్నాడు' అంటూ కామెంట్‌ చేశారు. మరికొదరు మాత్రం మనోడి ట్యాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు.

వీడియో కోసం లింక్ ని క్లిక్ చేయండి: https://youtube.com/shorts/XVz1TXs225k?si=P7BuWQGo10qTKM6C

Show Full Article
Print Article
Next Story
More Stories