Viral Video: AC చాలా రోజుల తర్వాత ఆన్‌ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!

Viral AC Snake Shocking Moment Snakes Found in Air Conditioner Must See Video
x

Viral Video: AC చాలా రోజుల తర్వాత ఆన్‌ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!

Highlights

Snakes In AC Video: తస్మాత్‌ జాగ్రత్త.. మీ ఇంట్లో కూడా ఏసీ ఉందా? ఎండాకాలం చాలా వేడిగా ఉందని ఏసీ ఆన్‌ చేస్తున్నారా? అవి పాములకు ఆవాసాలుగా మారుతున్నాయని మీకు తెలుసా?

Snakes In AC Video: ఎండాకాలం వచ్చింది. ఇక కూలర్లు, ఏసీలు ఆన్‌ చేసే సమయం. అయితే, ఒక్క నిమిషం మీ ఇంట్లో ఏసీ ఉందా? అయితే, ఈ వీడియో చూడండి.. సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో పెడితే అవి వెంటనే వైరల్‌ అయిపోతాయి. ఏసీకి సంబంధించిన ఈ వీడియో కూడా నెట్టింటా వైరల్‌ అవుతోంది.

తస్మాత్‌ జాగ్రత్త.. మీ ఇంట్లో కూడా ఏసీ ఉందా? ఎండాకాలం చాలా వేడిగా ఉందని ఏసీ ఆన్‌ చేస్తున్నారా? అవి పాములకు ఆవాసాలుగా మారుతున్నాయని మీకు తెలుసా? ఈ ఘటన విశాఖపట్టణం పెందుర్తిలో జరిగింది. ఎండ వేడిమి పెరిగిందని సత్యనారాయణ అనే వ్యక్తి ఏసీ ఆన్‌ చేశాడు. అంతే, ఒళ్లు గగుర్పొడించింది. అందులో ఓ పాము దాని పిల్లలు కూడా ఉన్నాయి.

వర్షాకాలం, ఆ తర్వాత చలికాలం వచ్చింది అన్ని రోజులు ఏసీ ఆన్‌ చేయలేదు. ఇక ఎండాకాలం వచ్చింది అని ఏసీ ఆన్‌ చేద్దామని ఆన్‌ చేశాడు. వెంటనే అందులో పాములు వాటి 8 పిల్లలను కూడా గమనించాడు. వెంటనే విషయాన్ని స్నేక్‌ క్యాచర్లకు సమాచారం అందించాడు. వాళ్లు వెంటనే వచ్చి ఏసీలో నుంచి పాము, వాటి పిల్లలను కూడా బయటకు జాగ్రత్తగా తీసేశారు.

ఈ ఏసీలో పాములున్న వీడియో నెట్టింటా వైరల్‌ అవుతోంది. మీ ఏసీల్లో కూడా పాములు ఉన్నాయేమో ఓసారి చెక్‌ చేసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఆ వ్యక్తి పాము పిల్లలను పట్టుకుని ఉన్నాడు. అవి ఏసీలో నుంచి తీసిన పాము పిల్లలు. ఆ పాము పిల్లలను స్నేక్‌ క్యాచర్లు ఓ సంచిలో వేసి తీసుకెళ్లారు. సోషల్‌ మీడియాలో ఏ వీడియో తీసి పెట్టినా వెంటనే వైరల్‌ అవుతాయి. ఏసీలో ఈ పాములున్న వీడియో కూడా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనికి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. గతంలో కూడా ఓ కాలేజీ ఏసీ వెంట్‌లో నుంచి పాము క్లాస్‌ రూమ్‌లోకి వచ్చిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. క్లాస్‌రూమ్‌లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఎవరికీ ఏ హానీ జరగలేదు. వెంటనే స్నేక్‌ క్యాచర్లు ఆ పామును పట్టేశారు.

అలాగే ఓ రన్నింగ్‌ ట్రైన్‌లో కూడా పాములు కనిపించడం చూశాం. ప్రధానంగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్‌ అవుతాయి. చాలామంది పాములకు సంబంధించిన వీడియోలు బాగా వెతుకుతారు. వాటిని వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారు.


Show Full Article
Print Article
Next Story
More Stories