ఘనంగా వినోద్‌ ఫిల్మ్‌ అకాడమీ 4వ వార్షికోత్సవం.. లాంప్ మూవీ ట్రైలర్ లాంఛ్..

Vinod Film Academy 4th Anniversary and Lamp Movie Trailer Released
x
Highlights

Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఇటీవల జూబ్లీ హిల్స్‌లోని ఘనంగా నిర్వహించారు.

Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఇటీవల జూబ్లీ హిల్స్‌లోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ నువ్వుల మాట్లాడుతూ.. 'ఈ నాలుగేళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా ఉంది. మా అకాడమీ నుంచి అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం టాలీవుడ్‌లో పనిచేస్తుండడం గర్వంగా ఉంది. వినోద్ ఫిల్మ్ అకాడమీ కొత్త టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంది' అని తెలిపారు.

ఇక ఈ సందర్భంగా వినోద్‌ హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ల్యాంప్‌ చిత్ర ట్రైలర్‌ను సముద్ర నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ లాంచ్‌ చేశారు. జీవీఎం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రైలర్ విడుదల జరిగింది. ఈ లాంచ్ లో ప్రముఖ అతిథులుగా పృథ్వీరాజ్, కార్పొరేటర్ క్రాంతి, చలపతి, డైరెక్టర్ రాజశేఖర్‌తో పాటు హీరోయిన్ పాల్గొన్నారు.

వేడుకలో ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ఫిల్మ్ అకాడమీలు పరిశ్రమకు మంచి సాంకేతిక నిపుణులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ కూడా తమ మార్కును చూపిందని కొనియాడారు. ఇక నటులు 30 ఈయర్స్ పృథ్వీ, నిర్మాత శబరి మహేంద్రనాథ్, నటుడు రాజశేఖర్, యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. అకాడమీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతుందని నిర్వాహకులు తెలిపారు. వినోద్ ఫిలిం అకాడమీ ప్రిన్సిపాల్ ప్రముఖ హాస్య నటులు కిషోర్‌ దాస్‌, బబ్లు, ఉషశ్రీ మురళి , లాంప్ మూవీ డైరెక్టర్ రాజశేఖర్, ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ ఫిలిమ్స్ రవీంద్రగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories