ట్రాక్టర్‌ స్టంట్‌మ్యాన్.. ఓ యువకుడి డేరింగ్ స్టంట్స్

ట్రాక్టర్‌ స్టంట్‌మ్యాన్.. ఓ యువకుడి డేరింగ్ స్టంట్స్
x
Highlights

స్టంట్‌లు చేయడానికి, కాదేది అనర్హమని నిరూపించాడు ఓ యువకుడు. బైకు, సైకిలు కాదు, ఎవరూ ఊహించని వెహికల్‌తో దుమ్మురేపుతున్నాడు. అలాంటి స్టంట్స్‌లో అతను...

స్టంట్‌లు చేయడానికి, కాదేది అనర్హమని నిరూపించాడు ఓ యువకుడు. బైకు, సైకిలు కాదు, ఎవరూ ఊహించని వెహికల్‌తో దుమ్మురేపుతున్నాడు. అలాంటి స్టంట్స్‌లో అతను రాటుదేలిపోయాడట. కానీ ట్రైనింగ్ ‌లేకుండా, ట్రైనర్స్‌ పక్కనలేకుండా, అందులోనూ అలాంటి స్టంట్స్‌ ఎవరూ చేయొద్దని కూడా అతను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకీ అతని స్టన్నింగ్‌ స్టంట్స్‌ ఏ వెహికల్‌తో.

బైక్‌ స్టంట్స్‌ చాలా చూశాం. ప్రొఫెషనల్‌ ప్లేయర్స్ నుంచి రోడ్లు, వీధుల మీద మోటార్ సైకిల్‌ను తెగ మెలికలు తిప్పించే సాహసకృత్యాలూ చూశాం. కానీ హెవీ వెయిట్‌ వుండే ట్రాక్టర్‌తో డేరింగ్‌ స్టంట్స్ చేయడం మీరెప్పుడైనా చూశారా.

ట్రాక్టర్‌ స్టంట్‌ మ్యాన్‌ విన్యాసాలు. ట్రాక్టర్‌తో స్టంట్స్‌ చేస్తున్న ఈ యువకుని పేరు గగ్గి బన్సారా. పంజాబ్‌ కుర్రాడు. అందరూ ఇతన్ని ట్రాక్టర్‌ స్టంట్‌ మ్యాన్‌ అని పిలుస్తుంటారట. అయితే మొదట్లో బన్సారా తల్లిదండ్రులు, ట్రాక్టర్‌తో విన్యాసాలకు అసలు ఒప్పుకోలేదట. గాయాలవుతాయి, చాలా ప్రమాదమని హెచ్చరించారట. అయితే, గగ్గి బన్సారా ఫ్రెండ్స్‌, అతని పేరెంట్స్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారట. అతనికి తపన వుంది, ప్రోత్సహించాలని కోరారట. దీంతో కండీషన్లతో కూడిన పర్మిషన్‌ ఇచ్చారట పేరెంట్స్‌.

గగ్గి బన్సారా, అనేక సినిమాలు, సాంగ్స్‌లో ట్రాక్టర్‌ స్టంట్స్ చేశాడు. లోకల్‌గా జరిగే ప్రతి ఉత్సవంలోనూ, ప్రదర్శన చెయ్యాలని అందరూ పట్టుబడతారట. స్టంట్స్ ఫెర్‌ఫామ్ చేయడానికి తన స్నేహితుల నుంచి కూడా ఆర్థికసాయం తీసుకున్నాడట బన్సారా. రిపేర్లు, డీజిల్‌ వంటి ఖర్చులు ఫ్రెండ్సే భరించేవారట. అయితే ఫైనాన్షియల్‌తో పాటు ఫిజికల్‌గానూ కష్టతరమైన ఈ స్టంట్స్‌ను వదిలివేయాలని, సన్నిహితులు అనేకసార్లు హెచ్చరించారట. కానీ బన్సారా మనస్సు మాత్రం, ముందుకే వెళ్లమని చెప్పిందట. ట్రాక్టర్‌ను వెనక టైర్ల మీద నడపగలడు బన్సారా. ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌ కావాలన్నది తన తపన అంటాడు బన్సారా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories