Man VS Leopard: ఆడు మగాడ్రా బుజ్జి.!. ఒట్టి చేతులతో చిరుతతో ఫైటింగ్ కు దిగిన యువకుడు..!

UP Worker Fights Leopard Video Viral Lakhimpur Incident
x

Man VS Leopard: ఆడు మగాడ్రా బుజ్జి.!. ఒట్టి చేతులతో చిరుతతో ఫైటింగ్ కు దిగిన యువకుడు..!

Highlights

Man VS Leopard Video: అడవులకు సమీపంలోని గ్రామాలలో చిరుతలు సంచరించడం తరచూ కనిపించే విషయం.

Man VS Leopard Video: అడవులకు సమీపంలోని గ్రామాలలో చిరుతలు సంచరించడం తరచూ కనిపించే విషయం. రాత్రిపూట అడవి ప్రాంతాల్లో చిరుతలు వేట కోసం బయల్దేరి, ఇళ్లలోకి చొరబడి పెంపుడు శునకాలను తీసుకెళ్లిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాత్రిపూట ద్విచక్రవాహనాలపై అడవి మార్గాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరిలో ఒక భయానక ఘటన జరిగింది. దగ్గరలోని అడవి నుంచి వచ్చి ఓ చిరుత గ్రామంలో హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలో మిహిలాల్ అనే కార్మికుడిపై చిరుత దాడికి దిగింది. అయినప్పటికీ అతను ఒక్కనిమిషం కూడా భయపడలేదు. చిరుత పంజా విసురుతున్నా, ధైర్యంగా ఎదిరించాడు.

చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చిరుతను బట్టి ఇటుకలతో దాడి చేశారు. దీంతో చిరుత అలా కొంత సేపటి తర్వాత బలహీనపడింది. చివరకు దెబ్బలకు భయపడి అడవిలోకి పారిపోయింది. వెంటనే మిహిలాల్‌ను ఆస్పత్రికి తరలించారు. అతనికి తక్కువపాటి గాయాలు కావడంతో ప్రాణాపాయం తప్పింది.

ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మిహిలాల్ ధైర్యానికి షబాష్‌ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories