UK Woman: ఈ మహిళ గోళ్లని శుభ్రం చేసే బిజినెస్‌తో కోటీశ్వరాలైంది..

UK Woman: అమెరికాకు చెందిన ఒక మహిళ గోళ్లని శుభ్రం చేసి ఆర్ట్ వేసే పనిలో నైపుణ్యం సంపాదించి ఈ రోజు కోటీశ్వరాలైంది.

hmtv Digital Team
Published on: 26 Oct 2021 5:33 PM IST
UK Woman has Become a Millionaire With her Nail Cleaning Business
X

యుకె కుచెందిన అన్నాబెల్ (ఫైల్ ఇమేజ్)

UK Woman: అమెరికాకు చెందిన ఒక మహిళ గోళ్లని శుభ్రం చేసి ఆర్ట్ వేసే పనిలో నైపుణ్యం సంపాదించి ఈ రోజు కోటీశ్వరాలైంది. నమ్మలేకుండా ఉన్నా ఇది నిజం. ఈ మహిళ విజయగాథను ఇప్పుడు అందరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. 30 ఏళ్ల అనాబెల్ ఒకప్పుడు మనుషుల గోళ్లను శుభ్రం చేసేది. కానీ నేడు కోట్లాది వ్యాపారాన్ని సొంతంగా నడుపుతోంది. చిన్న వయసులోనే పెద్ద విజయాన్ని సాధించింది. ఆమె ఇది ఎలా సాధించిందో తెలుసుకుందాం.

మొదటగా అన్నాబెల్ తల్లి వంటగదిలో నెయిల్ ఆర్ట్ పనిని ప్రారంభించింది. ఆమె స్నేహితుల గోళ్లను శుభ్రం చేసి వాటిపై నెయిల్ ఆర్ట్ వేసేది. క్రమంగా ఈ విద్య అన్నాబెల్‌ కూడా నేర్చుకుంది. ఈ రంగంలో ఎంతో పేరు సంపాదించింది. కస్టమర్లు పెరిగిపోయారు. ఈమె ఇంటిముందు క్యూ కట్టారు. ఈరోజు ఆమె కోట్ల విలువైన నెయిల్ ఆర్ట్ వ్యాపారాన్ని నడుపుతోంది. మమ్మీ వంటగది నుంచి ప్రారంభమైన ఈ పనిని బ్యూటీషియన్ అనాబెల్ పెద్ద వ్యాపారంగా మార్చారు.

30 ఏళ్ల అన్నాబెల్ ఈరోజు సోషల్ మీడియాలో సంచలనం. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఆన్‌లైన్‌లో ఆమెకు 7.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అన్నాబెల్ స్టాఫోర్డ్‌షైర్‌లో ఒక సెలూన్‌ను ప్రారంభించింది. ఇక్కడ థీమ్ నెయిల్ ఆర్ట్ చేయడం ప్రారంభించింది. ఈ పనిలో చాలా ప్రావీణ్యం సంపాదించింది. ఆమె వేస్తున్న థీమ్ నెయిల్ ఆర్ట్‌ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. అన్నాబెల్‌ తన భర్త సహాయంతో ఈ వ్యాపారాన్ని నడుపుతోంది. భవిష్యత్‌లో మరిన్ని సెలూన్‌లను తెరిచే ఆలోచన కూడా ఉన్నట్లు ఆమె చెప్పింది.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story