Viral Video: వారెవ్వా ఏమి స్టంట్ బాసూ.. ఇదేమి పొయ్యేకాలం రా బాబూ.. మీరూ చూడండి ఇదే మాట అంటారు!

Viral Video: ప్రస్తుతం యువకులు బైక్ లేదా కారును వేగంగా నడపడానికి ప్రయత్నిస్తారు.

hmtv Digital Team
Updated on: 2 Sept 2021 1:37 PM IST
Two Young men Trying to Make Stunts on Bike What Happened for Them Have a Look on This Viral Video
X

Viral Video: వారెవ్వా ఏమి స్టంట్ బాసూ.. ఇదేమి పొయ్యేకాలం రా బాబూ.. మీరూ చూడండి ఇదే మాట అంటారు!

Viral Video: ప్రస్తుతం యువకులు బైక్ లేదా కారును వేగంగా నడపడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా, వాటిపై స్టంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు కిందపడతారు. పక్కవారినీ కిందపడేసి ఇబ్బందుల పాలు చేస్తారు. ఈ స్టంట్లు ఒక్కోసారి ప్రాణాల మీదకూ తెస్తాయి. మీకు ఇప్పుడు అందిస్తున్న ఈ వీడియో తాము చేసిన పనికి తమ నడుములు విరగ్గోట్టుకోవడమే కాకుండా సంబంధం లేని వ్యక్తికీ దెబ్బలు తగిలేలా చేశారు. ఈ వీడియోలో, ఇద్దరు యువకులు అధిక వేగంతో బైక్ నడపడానికి ప్రయత్నం చేశారు. దీంతో యువతకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అన్ని చోట్లా వైరల్ అవుతోంది.

ఇద్దరు యువకులు హడావిడిగా బైక్ మీద కూర్చున్నారు. వెనుక కూచున్న వ్యక్తి బైక్ నడిపే వ్యక్తిని రెండుకాళ్ళు వేసి పట్టుకున్నాడు. అంటే ముందుగానే ప్లాన్.. స్టంట్ చేయడం కోసం. తాను పడిపోకుండా మున్డున్నవాడిని పట్టుకున్నాడు. బైక్ నడిపే వాడు బైక్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. గేరు మర్చి.. ఒక్కసారే ఎక్సిలేటర్ రేజ్ చేసి క్లచ్ వదిలాడు. అంతే.. ముందు చక్రం గాల్లోకి లేచింది. వెనుక చక్రం పట్టు తప్పింది. అంతే అమాంతం బైక్ వెనక్కి విరుచుకుపడింది. దానితో పాటు బైక్ మీద ఉన్న ఇద్దరు యువకులూ వెనక్కి పడ్డారు. అయితే, ఆ పడటం అక్కడే కూచుని ఉన్న మరో యువకుని మీద పడ్డారు. ముగ్గురి ఎముకలూ విరిగాయి.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బైక్ ల మీద స్టంట్లు చేసే అబ్బాయిలూ జరా భద్రం. మీ తప్పు ఇతరులకు శాపం అవుతుంది.

ఈ వీడియో మీరూ చూసేయండి..కచ్చితంగా మీరూ అదే మాట అంటారు.. జరా భద్రం అని..



hmtv Digital Team

hmtv Digital Team

Next Story