Viral Video: రెండు పాముల మధ్య భీకర పోరు.. చివరికి ఏమైందంటే..?

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోల్లో మెజారిటీ పాములకు సంబంధించినవే ఉంటాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2024 12:41 PM IST
Two Snakes Fight Each Other Video Goes Viral in Social Media
X

Viral Video: రెండు పాముల మధ్య భీకర పోరు.. చివరికి ఏమైందంటే..?

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోల్లో మెజారిటీ పాములకు సంబంధించినవే ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోలకు భలే క్రేజ్‌ ఉంటుంది. ఎక్కడ పాము కనిపించినా వెంటనే స్మార్ట్ ఫోన్‌లు తీసి వీడియోలను రికార్డ్‌ చేస్తున్నారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు కాస్త తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. చూడ్డానికి భయంగా ఉన్నా పాములకు సంబంధించిన వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. రెండు పాముల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. రెండు కింగ్‌ కోబ్రాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగాయి. నువ్వా నేనా అంటూ ఓ రేంజ్‌లో ఫైట్ చేసుకున్నాయి. అయితే చివరిలో ఈ రెండు పాములు ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అప్పటి వరకు పోటాపోటీ పడ్డ పాములు ఒక్కసారిగా కోపాన్ని వీడాయి, చేరో దారి చూసుకుంటూ ముందుకుసాగిపోయాయి. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే అప్పటి వరకు ఆ పాములు ఎందుకు పోట్లాడుకున్నాయి.? ఉన్నపలంగా ఎందుకు శాంతించాయి అన్న విషయం అర్థంకాకపోవడమే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాములు సయ్యాట ఆడి ఉండొచ్చంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story