Viral Video: రోడ్డే బాక్సింగ్ రింగ్..ఆ తాతలే కనుక ఒలింపిక్స్ కు వెళ్లుంటే..రెండు మెడల్స్ వచ్చేవి..ఎందుకో మీరే చూడండి..

Viral Video: సోషల్ మీడియా మన జీవితంలో అంతర్భాగంగా మారింది.

hmtv Digital Team
Published on: 1 Sept 2021 4:20 PM IST
Viral Video: రోడ్డే బాక్సింగ్ రింగ్..ఆ తాతలే కనుక ఒలింపిక్స్ కు వెళ్లుంటే..
X

Viral Video: రోడ్డే బాక్సింగ్ రింగ్..ఆ తాతలే కనుక ఒలింపిక్స్ కు వెళ్లుంటే..

Viral Video: సోషల్ మీడియా మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి వీడియోల్లో ముసలివారి వీడియోలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కువగా పెద్దవయసు వారు ఆ వయసులో కూడా యువకుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో షేర్ అయ్యి సందడి చేస్తాయి. కానీ, ఈ వీడియో అందుకు భిన్నం. ఇది చూస్తే మీరూ షాక్ అవుతారు ఖాయంగా.

ఈ వీడియోలో ఏముందంటే ఇద్దరు తాతయ్యలు వాదించుకుంటున్నారు. అదేమీ విచిత్రం కాదే అనుకోకండి పూర్తిగా వినండి ఇద్దరి మధ్య దేనికోసమో మెల్లగా వాదన మొదలైంది. తరువాత ఒకరికి ఇంకొకరిపై కోపం వచ్చింది. అవతలి తాతను నేట్టేశాడు. దీంతో రెండో తాత పొజిషన్ లోకి వచ్చేశాడు. తనను నెట్టిన తాతను ఒక్కటి పీకాడు. అంతే రెండో తాతగారు మాత్రం తక్కువా వెంటనే ఫెడీల్ మని ఒక్కటి అందుకోవడమే కాకుండ అవతలి తాతను గట్టిగా పట్టుకుని రెండు పీకులు పీకాడు. ఈయనా ఊరుకోలేదు. ఇద్దరూ కలబడ్డారు కిందపడ్డారు. వీర లెవెల్లో రోడ్డునే బాక్సింగ్ రింగ్ గా మార్చేశారు. ఒకరి మీద ఒకరు పది గుద్దులు గుద్దేసుకున్నారు. అన్నట్టు ఈ పంచ్ ల హడావుడిలో ఒకరి పెట్టుడు పళ్ళు రాలిపోయాయి. ఆయన గారు వాటిని మళ్ళీ తగిలించుకుని మరీ ఫైట్ కంటిన్యూ చేశారు.

వార్నీ భడవా ఏందిరా ఇదీ అనే రేంజిలో ఉన్న ఈ ఫైట్ చూస్తె మీకు కూడా మతిపోవడం ఖాయం. ఇంత వయసులో కూడా ఏమిట్రా బాబూ ఇదీ అనిపించడం గ్యారెంటీ.

వీడియో చూడండి:


hmtv Digital Team

hmtv Digital Team

Next Story