Viral Video: సింహాలను తరిమికొట్టిన కుక్కలు.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: కుక్కులను గ్రామ సింహాలుగా చెబుతుంటారు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది నిజంగా అనిపిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 17 Aug 2024 12:30 PM IST
Two dogs attack on lions video goes viral in social media
X

Viral Video: సింహాలను తరిమికొట్టిన కుక్కలు.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: కుక్కులను గ్రామ సింహాలుగా చెబుతుంటారు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది నిజంగా అనిపిస్తోంది. రెండు శునకాలు సింహాలతో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడ్డాయి. తమ యజమానులను రక్షించేందుకు ఎంతకైనా పోరాటం చేసే శునకాలు ఏకంగా సింహాలతోనే తలపడ్డాయి. గుజరాత్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఆమ్రేలి సావర్‌కుండ్లాలోని ఓ గోశాలలో ఆదివారం అర్ధరాత్రి రెండు సింహాలు గోశాల వైపు వచ్చాయి. ఈ గోశాలకు సమీపంలో గిర్‌ నేషనల్ పార్క్‌ ఉంది. ఈ అడవి నుంచి క్రూర మృగాలు ఈ ప్రాంతాంలోకి వస్తుండడం సర్వ సాధారణంగా జరుగుతుంటుంది. ఆదివారం ఈ పార్క్‌ నుంచే రెండు సింహాలు వచ్చాయి. గోశాల వద్ద ఉన్న గేటు వద్దకు రెండు సింహాలు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాయి. దీంతో గేటు లోపల ఉన్న రెండు శునకాలు సింహాలపై అరవడం మొదలు పెట్టాయి. సింహాలను చూసి కూడా ఏమాత్రం జంకు లేకుండా తరిమికొట్టేందుకు ప్రయత్నించాయి.

ఒకానొక సమయంలో సింహాలు గేటును ధ్వంసం చేశాయి కూడా. అయితే కుక్కుల ఏమాత్రం వెనక్కకు తగ్గకుండా సింహాల పైకి దూకాయి. దీంతో అప్పటికే భయపడిన సింహాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అంతలోనే కుక్కల అరుపులకు, సింహాల గర్జనలు విని గేట్‌ వద్దకు సెక్యూరిటీ గార్డ్‌ వచ్చాడు. వచ్చి రాగానే ఓ టార్చ్‌ పట్టుకొని అక్కడికి వచ్చాడు. అప్పటికే సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అయితే ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సింహాలు ఇలా ఊర్లోకి వస్తే ఎలా వామ్మో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story