Tips For Avoiding Seasonal Diseases: ముందే వ‌ర్ష‌కాలం.. ఆపై క‌రోనా కాలం.. ఇలా చేస్తే సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరం

Tips For Avoiding Seasonal Diseases: ముందే వ‌ర్ష‌కాలం.. ఆపై క‌రోనా కాలం.. ఇలా చేస్తే సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరం
x

 Tips For Avoiding seasonal diseases, like Cold And Flu Virus

Highlights

Tips For Avoiding Seasonal Diseases: ఇప్పుడు వ‌ర్ష‌కాలం.. ఆపై క‌రోనా కాలం.. ఎవ‌రైనా ద‌గ్గిన‌, తుమ్మినా క‌రోనానే అని అనుమానప‌డే కాలం.. ఈ కాలంలో జ‌లుబు, ద‌గ్గు, ప్లూ, జ‌ర్వం.. వంటి వివిధ అనారోగ్యాలు చుట్టుముట్ట‌డం స‌హ‌జం.

Tips For Avoiding Seasonal Diseases: ఇప్పుడు వ‌ర్ష‌కాలం.. ఆపై క‌రోనా కాలం.. ఎవ‌రైనా ద‌గ్గిన‌, తుమ్మినా క‌రోనానే అని అనుమానప‌డే కాలం.. ఈ కాలంలో జ‌లుబు, ద‌గ్గు, ప్లూ, జ‌ర్వం.. వంటి వివిధ అనారోగ్యాలు చుట్టుముట్ట‌డం స‌హ‌జం. మ‌రి, వీటికి దూరంగా ఉండాలంటే.. కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. అవేంటో ఓ సారి చూద్దామా మ‌రి..

> వ‌ర్ష‌కాలంలో ఆక‌లి, జీర్ణ‌శ‌క్తి ప‌నితీరు మంద‌గిస్తాయి. కాబ‌ట్టి తేలిగ్గా అరిగే ప‌దార్థాల‌ను తీసుకోవాలి. అంతేకాదు.. కూర‌గాయల‌ను బాగా ఉడికించి తినాలి.

> ప‌చ్చి కూర‌గాయ‌ల‌కు , దుంప‌ల‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు శోంఠి, అల్లం జీల‌క‌ర్ర‌, మిరియాలు, వాము .. వంటివాటిని ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి.

> ముఖ్యంగా బ‌‌య‌ట ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జంక్ పుడ్ లాంటివి.

> వానాకాలంలో వేడి నీటితోనే స్నానం చేయాలి. అయితే అంత‌కంటే ముందు ఒంటికి నువ్వుల నూనే లేదా కొన్ని ర‌కాల ఆయుర్వేద తైలాల‌తో మ‌ర్థ‌న చేసి సున్ని పిండితో నులుగు పెట్టుకుని త‌రువాత స్నానం చేయాలి. దీనివ‌ల్ల శారీర‌క ఆల‌స‌ట దూర‌మ‌వుతుంది. ఒంటి నొప్పులూ బాధించ‌వు.

> ఒంటికి వ‌చ్చే జ‌బ్జుల‌కు ఇంట్లో బూజుకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇళ్లు ప‌రిశుభ్రంగా ఉంటే చాలా వ్యాధుల‌కు దూరంగా ఉన్న‌ట్టే. కాబట్టి ఇంట్లో బూజు ఏర్ప‌డ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకుంటు ఉండాలి.

> హెల్తీగా ఉండాలంటే తాజాగాలిని పీల్చాలి. ప్రస్తుత పరిస్థితుల వలన చాలా మంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కాబట్టి ఇంట్లోని గాలి క్వాలిటీను కూడా ఇంప్రూవ్ చేసే పద్దతులను పాటించాలి.

> తోలు వ‌స్తువులు, బూట్లు త‌డిగా లేకుండా చూసుకోవాలి. ఇంట్లో సాంబ్రాణి లేదా మూలిక‌ల‌తో పొగ వేసుకోవాలి. దీనివ‌ల్ల దోమ‌లు, చిన్న చిన్న సూక్ష్మ జీవులు చ‌నిపోయాయి.

> ఇంటి ప‌రిసరాల చూట్టూ మురుగు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు నిల్వ ఉంటే అందులో కిరోసిన్ గానీ, ఇత‌ర ర‌సాయ‌నాలు పోయాలి.

> అలాగే యోగా అనేది ఓ మంచి ఎక్సైజ్‌.. యోగా శ్వాసను క్లీన్స్ చేస్తుంది. మౌనంగా ఐదు నిముషాల పాటు నిటారుగా కూర్చోండి. మీ అటెన్షన్ ను మీ శ్వాసపై పెట్టండి. ముక్కుతో శ్వాస తీసుకోండి. నోటితో శ్వాసను వదలండి. నడక, స్కిప్పింగ్ వంటివి కూడా లంగ్స్ కెపాసిటీను పెంచుతాయి. ముక్కు బిగుసుకుపోయే సమస్యను తగ్గిస్తాయి.

> ఎండ వేడి లేక‌పోయినా ఈ కాలంలో చెమ‌ట ఎక్కువ‌గానే ప‌డుతుంది. కాబ‌ట్టి నూలు దుస్తులు ధ‌రించడం మంచిది. సింథ‌టిక్ వ‌స్రాల వ‌ల్ల చెమ‌ట చేరి, చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు రావ‌చ్చు.

> వానాకాలంలో ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ. కాబట్టి వ్యాధులు రాకుండా ఉండాలంటే నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. దీని కోసం కాచి, చ‌ల్లార్చిన నీటిని తాగాలి. దీని వ‌ల్ల నీళ్ల‌లో ఉండే సూక్ష్మ జీవులు న‌శించి, రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

> త‌రుచుగా క‌ప్పు పాల‌ల్లో అర‌చెంచా శొంఠి పొడి వేసి.. గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు కొద్దిగా తేనే క‌లుపుకొని తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories