ఆకలి తీర్చే మాతృమూర్తులు ....

ఆకలి తీర్చే మాతృమూర్తులు ....
x
Highlights

ఎందుకురా జీవిస్తున్నావు అంటే.. సంపాదించడం కోసం అంటారు చాలామంది. రూపాయి పెట్టుబడి పెట్టి వందరూపాయల లాభం కోసం చూస్తారు కొంతమంది. అందులోనూ ఆహారపదార్థాల మాట చెప్పక్కర్లేదు. లాభసాటి వ్యాపారంగా భావించి ఎందరో ఈవ్యాపారం లోకి అడుగుపెడతారు. ఆకలి తీర్చడమే మా పనా.. అనే పద్ధతిలో మాకు సంపాదన వద్దా అనే ధోరణిలో అమ్మకాలు సాగిస్తారు. కానీ, ఆకలి తీర్చడంలో ఆత్మత్రుప్తి ఉంది. బ్రతకడానికి మనకెంత కావాలో అంతే తీసుకోవడంలో ఆనందం ఉంది. ఆనడానికి ఆత్మతృప్తిని జోడిస్తే.. అదే మానవత్వంగా మిగిలిపోతుంది.

ఎందుకురా జీవిస్తున్నావు అంటే.. సంపాదించడం కోసం అంటారు చాలామంది. రూపాయి పెట్టుబడి పెట్టి వందరూపాయల లాభం కోసం చూస్తారు కొంతమంది. అందులోనూ ఆహారపదార్థాల మాట చెప్పక్కర్లేదు. లాభసాటి వ్యాపారంగా భావించి ఎందరో ఈవ్యాపారం లోకి అడుగుపెడతారు. ఆకలి తీర్చడమే మా పనా.. అనే పద్ధతిలో మాకు సంపాదన వద్దా అనే ధోరణిలో అమ్మకాలు సాగిస్తారు. కానీ, ఆకలి తీర్చడంలో ఆత్మతృప్తి ఉంది. బ్రతకడానికి మనకెంత కావాలో అంతే తీసుకోవడంలో ఆనందం ఉంది. ఆనడానికి ఆత్మతృప్తిని జోడిస్తే.. అదే మానవత్వంగా మిగిలిపోతుంది. ఆ మానవత్వాన్నే ప్రదర్శిస్తున్నారు కొందరు. వారు చేస్తున్న సేవ వింటే ఆశ్చర్యపోతారు మీరు. పావలాకే ఇడ్లీ ఇచ్చే మమ్మ ఒకరైతే.. పది రూపాయలకు కమ్మని దోశ పట్టేవారు మరొకరు. వీరికేమీ తీసిపోకుండా వైద్యం కోసం వచ్చేవారికీ, వారి బంధువులకూ రూపాయికే కడుపునిండా భోజనం పెడుతూ అందరి దీవెనలూ పొందుతున్నారు ఒకరు. వీరందరి విశేషాలూ ఎందరికో స్ఫూర్తినిస్తాయి అందుకే ఆ విశేషాలు మీకోసం అందిస్తోంది హెచ్ ఎం టీవీ.

ఒక్క సంఘటన అతని దృక్పథాన్ని మార్చేసింది..







తమిళనాడు కు చెందినా వి.వెంకట్రామన్ కు ఓ హోటల్ వుంది. అది సరిగ్గా ప్రభుత్వాసుపత్రి దగ్గరలో ఉంటుంది. ప్రతిరోజూ లానే యధావిధిగా తన హోటల్ లో క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నారాయన. ఈ సమయంలో ఒకామె వచ్చి ఆరు దోశలు కావాలని అడిగి పదిరూపాయల నోటు చేతిలో పెట్టింది. దానికి ఆయన ఆ డబ్బులకు ఆరు ఇడ్లీలే వస్తాయని చెప్పారాయన. అయితే, ఆమె బంధువులు ఆసుపత్రిలో ఉన్నారనీ, వారి ఆకలి తీరాలంటే ఆరు దోశలు అవసరం అవుతాయనీ, తన దగ్గర అంతకంటే డబ్బులు లేవనీ ప్రాధేయపడింది. ఆమె తీరుకు అయన మనసులో జాలి కలిగింది. ఆమెకు దోషాలు ఇచ్చి పంపించారు. తరువాత అయనను ఈ సంఘటన దొలిచేసింది. ఎందరో పేదలు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చి ఆకలితో అలమటించి పోవడం గమనించారాయాన. ఆ రోగుల బంధువులు తాము తినకుండా రోగుల కోసం ఆహారం తీసుకోవడం గమనించారు. దీనితో అయన తానెలా వారికి సహాయపడాలని ఆలోచించారు. అప్పట్నుంచీ.. తన హోటల్ లో ప్రతి రోజూ ఉదయం 15 అల్పాహారాలు, మధ్యాహ్నం 40 భోజనాలు, రాత్రి 15 అల్పాహారాలు నామమాత్రంగా ఒక్క రూపాయికే అందిస్తున్నారు. తనకు ఉన్నంతలో ఆ సహాయం మాత్రమె చేయగాలుగుతున్నాననీ, భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని ఆ రకంగా ఉపయోగించుకున్తున్నననీ అయన చెబుతున్నారు.

నాలుగు దోశలు పది రూపాయలే!







నాగపూర్ కి చెందినా శారదా చారగోడే అనే ఆమె భర్త పెట్టే హింసలు భరించలేకపోయింది. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో అతన్ని వదిలి పుట్టింటికి చేరింది. అయితే, పుట్టింటి వారికీ భారం కాకూడని నిర్ణయించుకుంది. దాంతో ఆమె నాగపూర్ లోని శ్రీదిది నగర్ స్కూల్ దగ్గర అల్పాహారం అందించే చిన్న దుకాణం పెట్టుకుని జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె చేసే దోశలకు మంచి పేరు వచ్చింది. దాంతో వ్యాపారం మంచిగానే నడుస్తోంది. ఈ సమయంలో ఆమెకు చిన్న ఆలోచన వచ్చింది. తన పిల్లలాంటి వారే కదా.. ఆ పిల్లలు. పాపం వారికి కడుపునిండా తినే అవకాశం లేదు కదా అనిపించింది. అప్పుడు ఆమె వారికి ఏమి సహాయం చేయగలనని ఆలోచించింది. చివరకు తనకు వచ్చిన విద్యతోనే వారి కడుపు నింపాలని భావించింది. కేవలం పది రూపాయలకు నాలుగు దోశలు పిల్లలకు, విద్యార్థులకు అందిస్తోంది ఆమె. రోడ్డు పక్క బండి వద్ద కూడా ఒక్క దోశ 20 రూపాయలు అమ్ముతారు. అటువంటిది లాభం ఆశించకుండా.. పిల్లల కడుపు నింపడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న సేవని నాగపూర్ లో అందరూ మెచ్చుకుంటున్నారు.

ఒక్కో ఇడ్లీ ఒక్క రూపాయే .... అంతకు ముందు యాబై పైసలే







ఇక ఈ అవ్వ చేస్తున్న పని తెల్సుకుంటే మీరూ ఆశ్చర్యపోతారు. నాలుగు ఇడ్లీలు మామూలుగా చిన్న హోటల్ లో అయినా ఎంత ఉంటాయి? కనీసం 20 రూపాయలు కదా.. కానీ ఈ అవ్వ మాత్రం రూపాయికే ఒక్క ఇడ్లీ ఇస్తుంది. ఆమె పేరు కె.కమలాత్తాళ్. ప్రస్తుతం ఆమె వయసు 80 ఏళ్లు. గత 50 ఏళ్లుగా ఆమె అతి తక్కువ రేటుకే ఇడ్లీలు అమ్ముతోంది. ఆమె మొన్నటి వరకూ ఇడ్లీలను 50 పైసలకే అమ్మేది. కానీ, ప్రస్తుతం 50 పైసల నాణేలు చెల్లుబాటులో లేకపోవడంతో ఇడ్లీల ధర పెంచక తప్పలేదని చెబుతోంది ఆమె. చాలా మంది ఆమెను ఇడ్లీ ధర పెంచావచ్చుగా అని సలహా ఇచ్చారు. ఆమె నవ్వేసి సున్నితంగా తిరస్కరించింది. రోజు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి ఇడ్లీ , చెట్నీ , సాంబారు సిద్దం చేస్తుంది . రోజుకు కనీసం వేయి ఇడ్లీలు అయిన చేస్తుంది . రోజుకు ఎంత వస్తుంది అనేదాని కంటే పేదవాళ్ళకి పేదల కడుపు నింపుతున్న సంతృప్తి తనకు చాలని ఈ అవ్వ చెప్పుకొస్తోంది.

ఈ రోజుల్లో నా అనుకున్నావారే నాలుగు మెతుకులు పెట్టని ఈ సమాజంలో ఎలాంటి సంబంధం లేకున్నా ఎలాంటి లాభం ఆశించకుండా తక్కువ ధరలకే పేదవాళ్ళ కడుపు నింపుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న వీరందరికీ సలాం చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి ... !

Show Full Article
Print Article
More On
Next Story
More Stories