Honeymoon: హనీమూన్‌కి ఈ ప్రదేశాలు ఉత్తమ ఎంపిక..

Honeymoon: హనీమూన్ గురించి పెళ్లైన ప్రతి జంట ఎన్నో కలలు కంటుంది.

hmtv Digital Team
Updated on: 10 Nov 2021 7:45 PM IST
These Places are the Best Choice for Honeymoon
X

హనీమూన్ వెళ్ళడానికి మంచి ప్రదేశాలు (ఫైల్ ఇమేజ్)

Honeymoon: హనీమూన్ గురించి పెళ్లైన ప్రతి జంట ఎన్నో కలలు కంటుంది. ఇద్దరు ఏకాంతంగా ఒక అందమైన ప్రదేశంలో గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తారు. హనీమూన్ దంపతులకు జీవితంలో ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒక కొత్త బంధాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది. అందుకే ఆధునిక కాలంలో చాలామంది జంటలు వివాహమైన మరుక్షణమే హనీమూన్ గురించి ఆలోచిస్తారు. ఎక్కడి వెళితే బాగుంటుందో ముందునుంచే ఆలోచిస్తారు. అయితే ప్రపంచంలో బెస్ట్ హనీమూన్ స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పారిస్ నగరం

పారిస్ నగరం, ది సిటీ ఆఫ్ లైట్స్ నగరాలలో అత్యంత శృంగారభరితంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ రాత్రి ఉండదని అంటారు. పారిస్ ప్రత్యేకమైన అందానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు ఈఫిల్ టవర్, ది ఆర్క్ డి ట్రియోంఫే, రివర్ క్రూయిస్, ది పాల్స్ ఆఫ్ వెర్సైల్లెస్ని ఆస్వాదించవచ్చు. హనీమూన్ ఎక్కువమంది ఇక్కడికే వెళుతారు.

2. మాల్దీవులు

ఈ రోజుల్లో మాల్దీవులు హనీమూన్కి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న నీలిరంగు నీరు మీ ప్రేమను పెంచుతుంది. మాల్దీవులలో మీరు బనానా రీఫ్, మాల్దీవ్స్ విక్టరీ, హెచ్పి రీఫ్లలో తిరగవచ్చు.

3. ఫిలిప్పీన్స్

ఫిలిప్పీన్స్ హనీమూన్ కోసం ఉత్తమ ఎంపిక. ఎల్ నిడో ఫిలిప్పీన్స్లోని చాలా అందమైన, గంభీరమైన ప్రదేశం, ఇక్కడ అందరూ సందర్శించడానికి ఇష్టపడతారు. స్మాల్ లగూన్, కేథడ్రల్ బీచ్, స్నేక్ ఐలాండ్ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.

4. బెలిజ్

బెలిజ్ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన హనీమూన్ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి సముద్ర ప్రాంతం మీ మనసును ఆకట్టుకుంటుంది. ఇక్కడి వాతావరణం అందరినీ పిచ్చెక్కిస్తుంది.

5. స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ మొదటి నుంచి అందానికి ప్రసిద్ధి చెందింది.ఈ ప్రదేశం ఆకర్షణీయమైన అందం కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి జంటలను ఆకర్షిస్తుంది. ఇక్కడ సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు స్విస్ నేషనల్ పార్క్, ది మాటర్హార్న్, ఫాస్నాచ్ స్ప్రింగ్ కార్నివాల్లో ఇక్కడ ఆనందించవచ్చు.

6. బోరా ద్వీపం

బోరా ద్వీపం అత్యంత శృంగార ప్రదేశాలలో ఒకటి. జంటలు హనీమూన్ జరుపుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు కొత్తగా పెళ్లయిన జంటల మనసులో ప్రేమ అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ మీరు స్కూబా స్నార్కెలింగ్, మతిరా బీచ్ సందర్శించవచ్చు.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story