Bharat Ratna Award: భారతరత్న పొందిన వ్యక్తులకు ఈ సౌకర్యాలు ఉచితం.. ఇంకా దేశంలో ఈ హోదా పొందుతారు..!

These Facilities are Free for Bharat Ratna Awardees and Still Enjoy This Status in the Country
x

Bharat Ratna Award: భారతరత్న పొందిన వ్యక్తులకు ఈ సౌకర్యాలు ఉచితం.. ఇంకా దేశంలో ఈ హోదా పొందుతారు..!

Highlights

Bharat Ratna Award: భారతరత్న దేశంలో అత్యున్నత పౌరపురస్కారం. దేశంకోసం పాటుపడిన మహనీయులకు దీనిని ప్రకటిస్తారు.

Bharat Ratna Award: భారతరత్న దేశంలో అత్యున్నత పౌరపురస్కారం. దేశంకోసం పాటుపడిన మహనీయులకు దీనిని ప్రకటిస్తారు. మరణానికి ముందు మరణాంతరం వారి సేవలను స్మరిస్తూ ఈ అవార్డు ఇస్తారు. 3 ఫిబ్రవరి 2024న మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. దీనిని 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు. జనవరి 23న మరణానంతరం జననాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పేరును ప్రకటించారు. దీంతో కర్పూరీ ఠాకూర్ 49వ వ్యక్తి కాగా ఎల్‌కే అద్వానీ 50వ వ్యక్తిగా ఈ గౌరవాన్ని పొందారు. భారతరత్నతో గౌరవించబడిన వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

2011 సంవత్సరం వరకు కళ, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డును ప్రకటించేవారు. 2011 డిసెంబర్‌లో సవరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 'భారతరత్న' పేర్లను ప్రకటించాల్సిన అవసరం లేదు. భారతరత్న పొందిన వ్యక్తులకు మెడల్‌తోపాటు సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఎటువంటి నగదు బహుమతి ఉండదు. సంవత్సరానికి ముగ్గురు వ్యక్తులను మాత్రమే భారతరత్నకు ఎంపిక చేస్తారు. చివరిసారిగా 2019లో నానాజీ దేశ్‌ముఖ్, డాక్టర్ భూపేన్ హజారికా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు మోదీ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది.

భారతరత్న పొందిన సెలబ్రిటీలకు ఈ హోదా లభిస్తుంది

భారతరత్న బిరుదు పొందినవారికి దేశంలో వీఐపీ హోదా లభిస్తుంది. ప్రొటోకాల్‌ ప్రకారం, అవార్డు పొందిన వ్యక్తి దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సమానంగా లెక్కిస్తారు. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, కేబినెట్ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తర్వాత వీరిని గౌరవిస్తారు.

ఈ సౌకర్యాలను పొందుతారు

భారతరత్న అవార్డు పొందిన వ్యక్తికి కేబినెట్ మంత్రితో సమానంగా వీఐపీ హోదా లభిస్తుంది. జీవితకాల ఆదాయపు పన్ను చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు హాజరు కావచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల కార్యక్రమాలలో ప్రత్యేక అతిథిగా పాల్గొనవచ్చు. భారతరత్న గ్రహీతలు విమానం, రైలు, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఏదైనా రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు అతను అక్కడ రాష్ట్ర అతిథి హోదాను పొందుతాడు. భారతరత్న పొందిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తాయి. ఈ అవార్డుతో గౌరవించబడిన వ్యక్తికి ప్రభుత్వం వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీలో స్థానం ఇస్తుంది. ఇది ఒక రకమైన ప్రోటోకాల్. ఇది ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌, మాజీ రాష్ట్రపతి, ఉపప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్‌, కేబినెట్‌ మంత్రి, ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకుడి తర్వాత స్థానం పొందుతాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories