Viral Video: పెళ్లి బారాత్ లో డ్యాన్స్‌.. ఆ త‌ర్వాత ఏడుపు.. ఎందుకంటే?

Viral Video: వేడుక‌లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుండిపోతాయి. తాజాగా వివాహ వేడుక‌లో ఓ యువ‌తి డ్యాన్స్ చేస్తుంది

hmtv Digital Team
Updated on: 24 Oct 2021 5:00 PM IST
The Young Woman who Danced on the Occasion of the Wedding then Cries Viral Video
X
ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియో

Viral Video: వివాహం ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో అతి పెద్ద వేడుక‌. అందుకే చాలా గ్రాండ్‌గా జ‌రుపుకుంటారు. అంద‌రికి గుర్తుండిపోయేలా నిర్వ‌హిస్తారు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల మ‌ధ్య ఉత్సాహంగా ఈ వేడుక జ‌రుగుతుంది. అయితే ఈ వేడుక‌లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుండిపోతాయి. తాజాగా వివాహ వేడుక‌లో ఓ యువ‌తి డ్యాన్స్ చేస్తుంది. అలాగే ఏడుస్తుంది కూడా. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. డ్యాన్స్ చేయ‌డం ఏంటి, మ‌ళ్లీ ఏడ‌వ‌టం ఏంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వీడియో చూసిన వాళ్లు మాత్రం పొట్ట‌చెక్క‌ల‌య్యేలా నవ్వుతున్నారు.

ఈ వీడియోలో వ‌ధువు త‌న అన్న‌ద‌మ్ముల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. చాలా హుషారుగా 'ముఝే సాజన్ కే ఘర్ జానా హై' పాటకు డ్యాన్స్ చేస్తుంది. కానీ కొంత స‌మ‌యం త‌ర్వాత గిన్నెలు తోముతూ ఏడుస్తూ క‌నిపిస్తుంది. 'న‌న్ను మా ఇంటికి పంపండ‌ని గిన్నెలు తోముతూ ఏడుస్తూ అడ‌గ‌డం' మ‌నం గ‌మ‌నించవ‌చ్చ. అయితే పెళ్లిలో హుషారుగా డ్యాన్స్ చేసిన యువ‌తి ఏడ‌వ‌టం అంద‌రిని న‌వ్విస్తుంది. ఎందుకంటే వివాహ‌మైన త‌ర్వాత ఎవ‌రి ప‌రిస్థితి అయినా ఇలాగే ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెబుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వైరల్ వీడియో చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేశారు. అవును ఇది నిజం ఇలాగే జ‌రుగుతుంద‌ని రాశారు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత‌మంది వ‌ధువు డ్యాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

త‌ర్వాత పాత్ర‌లు తోమ‌డాన్ని చూసి న‌వ్వుతున్నారు. కొంత‌మంది ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ వీడియోను నెటిజ‌న్ల తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూసి కామెంట్ చేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story