Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు.. షాకైన వరుడు..

Viral Video: ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

hmtv Digital Team
Updated on: 17 Nov 2021 12:00 PM IST
The Bride Dancing at the Wedding the Shocked Groom Viral Video
X

పెళ్లి కూతురు డాన్స్ చూసి షాక్ అయిన పెళ్లికొడుకు (ఇన్స్టాగ్రామ్ ఫోటో)

Viral Video: ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తున్నారు. దీంతో తొందరగా వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో వివాహ వేడుకలో వధూవరులు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. రోజుకొక కొత్త జంట డ్యాన్స్‌ వైరల్ అవుతుంది. తాజాగా ఓ వివాహ వేడుకలో వ‌ధువు డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేదికపై వధువు డ్యాన్స్‌ చేయడం మనం చూడవచ్చు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరించిన వధువు హర్యానావి శైలిలో డ్యాన్స్‌ చేస్తుంది. చాలా సింపుల్‌ స్టెప్పులు వేస్తూ అందంగా నవ్వుతూ డ్యాన్స్‌ చేయడం మనం వీడియోలో గమనించవచ్చు. ఆమె డ్యాన్స్ చూసిన వరుడు కూడా ఆమెతో కలిసి కాలు కదుపుతాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేయడం ప్రారంభిస్తారు. పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లతో వారిని ప్రోత్సహిస్తారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ వీడియో చూస్తే పెళ్లికి ముందు ఆచార సమయంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు వధువు చిరునవ్వు హృదయాన్ని కదిలిస్తుంది. దీంతో వీడియో చూసిన వారందరు పెళ్లికూతురికి ఫ్యాన్ అయిపోతున్నారు. వీడియోని చాలాబాగా ఇష్టపడుతున్నారు. కామెంట్స్‌, లైక్స్‌, షేర్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని ఇరవై వేల మందికి పైగా వీక్షించారు. వధువు డ్యాన్స్‌కి ఫిదా అయిపోయానని ఒక నెటిజన్‌ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్‌ తన వివాహాన్ని గుర్తు చేసిందని వధువుని ప్రశంసలతో ముంచెత్తాడు. మీరు కూడా ఈ వీడియోని చూసి మీ స్పందనను తెలియజేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story