Viral Video: అయ్య‌య్యో ప‌డిపోయారే..! పెళ్లిలో మీరెప్పుడైనా ఇలా చేశారా..?

The Bride and Groom who Fell Under the Wedding Reception Viral Video
x

డాన్స్ చేస్తూ కింద పడ్డ వధూవరులు (ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్)

Highlights

Viral Video: వాహ స‌మ‌యంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు వ‌ధూవ‌రులిద్ద‌రికి క‌ల‌కాలం గుర్తుండిపోతాయి.

Viral Video: వివాహం ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధుర‌మైన వేడుక‌. దీని కోసం యువతీ యువ‌కులు చాలా క‌ల‌లు కంటారు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతారు. అంద‌రిలో త‌మ వివాహం గుర్తుండిపోయే విధంగా జ‌రుపుకోవాల‌నుకుంటారు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఆశీస్సుల‌తో క‌ల‌కాలం ఉండాల‌నుకుంటారు. అయితే వివాహ స‌మ‌యంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు వ‌ధూవ‌రులిద్ద‌రికి క‌ల‌కాలం గుర్తుండిపోతాయి. తాజాగా ఓ వివాహ వేడుక‌లో న‌వ‌దంప‌తుల డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వివ‌రాలేంటో తెలుసుకుందాం.

ఈ వీడియోలో వ‌ధూవ‌రులిద్ద‌రు డ్యాన్స్ చేయ‌డానికి ఉత్సాహంగా ఉన్న‌ట్లు మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు. అయితే డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఇద్ద‌రు ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోవ‌డం మ‌నం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ స‌న్నివేశాన్ని చూసిన అతిథులు ఒక్క‌సారిగా న‌వ్వుతారు. అయ్య‌య్యో ప‌డిపోయారా అంటూ మ‌ళ్లీ చేయాల‌ని కోరుతారు. అయితే ఆ న‌వ‌జంట డ్యాన్స్ చేయ‌డం కోసం ఎంత ఉత్సాహంగా ఉన్నారో మ‌నం వీడియోలో తిల‌కించ‌వ‌చ్చు. అయితే త‌ర్వాత ఏం జ‌రిగిందో వీడియోలో స్ప‌ష్టంగా లేదు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియో హైటియన్‌బ్యూటీ 25 ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నెటిజ‌న్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప‌దే ప‌దే చూస్తూ న‌వ్వుతూ, షేర్స్‌, కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయితే మీరు ఈ వీడియో చూసి ఏమ‌నుకుంటున్నారో కామెంట్ చేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories