Viral Video: హైదరాబాద్‌కు అతి చేరువలో సన్‌ఫ్లవర్ తోట.. నెట్టింట వీడియో వైరల్, ఎక్కడో తెలుసా?

Sunflower Garden Video Viral
x

Viral Video: హైదరాబాద్‌కు అతి చేరువలో సన్‌ఫ్లవర్ తోట.. నెట్టింట వీడియో వైరల్, ఎక్కడో తెలుసా?

Highlights

Sunflower Garden Video Viral: ప్రకృతి ప్రేమికులకు పూలంటే చాలా ఇష్టం. అయితే,హైదరాబాద్ అంటే కాంక్రీట్ జంగిల్‌. కానీ, దీనికి అతి దగ్గరలో ఓ సన్‌ఫ్లవర్‌ తోట ఉంది అంటే మీరు నమ్ముతారా? హైదరాబాద్‌కు దగ్గరలో ఒక సన్‌ఫ్లవర్ తోట నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.. ఇది ఎక్కడుందో తెలుసా?

Sunflower Garden Video Viral: హైదరాబాద్‌కు అతి చేరువలో ఒక సన్‌ఫ్లవర్ తోట వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇన్‌ఫ్లూయేన్సర్‌ ఈ సన్‌ఫ్లవర్ తోట వీడియోను షేర్ చేశారు. అక్కడ ఫొటోస్ తీసి ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అది సోషల్‌ మీడియాలో చాలామందిని ఆకట్టుకుంటుంది. దీంతో చాలామంది ప్రకృతి ప్రేమికులు ఫోటోగ్రాఫర్లు ఆ సన్‌ఫ్లవర్ తోటకు క్యూ కట్టారు. చాలామంది ఈ సన్ ఫ్లవర్ తోట ఎక్కడుంది అని తెగ సర్చ్ చేస్తున్నారు. అది ఎక్కడుందో మీకు తెలుసా?

అయితే ఈ వీడియో ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అర్షియా రీల్ అనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు దగ్గర్లో ఉంది. కాసా ఫార్మ్, మద్దాపూర్ గ్రామం రిజర్వాయర్‌కు అతి దగ్గర్లో ఉంది. ఈ గ్రామంలో సన్‌ఫ్లవర్ తోట కనిపిస్తుంది. మద్దాపూర్ అనే విలేజ్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల హైవే, హైదరాబాద్ నుంచి రామగుండం హైవే గుండా వెళ్తుండగా కనిపించే కొండ పోచమ్మ రూట్లో ఉంది. అంటే సరిగ్గా 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి సరిగ్గా 2 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు ఈ సన్‌ఫ్లవర్ తోటను ఆస్వాదించవచ్చు.

అయితే ఈ సన్‌ఫ్లవర్ తోటను మీరు కూడా వీక్షించాలంటే ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ సందర్శకులకు ఉచితంగా ఫోటోలు తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో చాలా మంది ఫోటోషూట్లకు ఇతర ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అయితే ఈ సన్ ఫ్లవర్ పువ్వులు మార్చి నుంచి జూన్ లో ఎక్కువగా పూస్తాయి. మీరు కూడా ఈ సన్‌ఫ్లవర్ తోటకి వెళ్ళాలి అంటే ఇది పర్ఫెక్ట్ సమయం. ఆ తర్వాత మళ్లీ ఇలా సన్‌ఫ్లవర్‌ పూలను ఎప్పుడ చూస్తారో.. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటోలను తీసుకోండి. రీల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఇక పెళ్లిళ్ల సీజన్‌ కూడా అతి చేరువలోనే ఉంది కాబట్టి ఫోటో షూట్‌కు కూడా పర్ఫెక్ట్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories