టపాసుల పై ఆంక్షల బాంబ్..కళ తప్పిన దీపావళి!

టపాసుల పై ఆంక్షల బాంబ్..కళ తప్పిన దీపావళి!
x
Highlights

* దీపావళి పండుగపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు * సగానికి పైగా పడిపోయిన క్రాకర్స్ విక్రయాలు * నామమాత్రంగానే టపాసులు కొనుగోలు చేస్తున్న ప్రజలు * ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ ఆంక్షలతో ఆసక్తి చూపని ప్రజలు * ప్రభుత్వ నిబంధనలతోనే పండుగ జరుపుకోవాలంటున్న అధికారులు * క్రాకర్స్ కాల్చే సమయంలో శానిటైజర్ వాడొద్దని సూచన

కరోనా విజృంభణతో అనంతలో దీపావళి కళ తప్పింది. ప్రభుత్వ ఆంక్షలతో క్రాకర్స్ అమ్మకాలకు ఒక్కరోజే సమయం మిగిలుండడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఏడు నెలలుగా కరోనాతో కుదేలైన పేద, మధ్యతరగతి వర్గాలు దిపావళిని సంతోషంగా జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది దీపాల పండుగ పూర్తిగా కళ తప్పింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు దిపావళి నిర్వహించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం.. కరోనా దెబ్బకు ఆర్థికంగా ప్రజలు చితికిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కళ తప్పింది. దీనికితోడు టపాసుల విక్రయాలకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలుండడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలతో గతంతో పోల్చితే సగానికి పైగా విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగ రోజు రాత్రి 8 నుంచి 10 గంటల లోపు మాత్రమే టపాసులు పేల్చాలని ఆదేశాలు ఉండడంతో ప్రజలు నామాత్రంగా కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ ఆంక్షలతో పండుగను ఘనంగా జరుపుకోవడానకి అటు ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ప్రజలు బాణసంచా కొనుగోలు చేయాలనికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. పిల్లల కోసం నామమాత్రంగానే తీసుకెళుతున్నామని.. ముందులాగా పండుగ జరపుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు.

అటు ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని దీపావళి పండుగను జరుపుకోవాలని అధికారులు చెబుతున్నారు. క్రాకర్స్ కాల్చే సమయంలోఎట్టిపరిస్థితుల్లోనూ శానిటైజర్ వినియోగించవద్దని, ప్రమాదాలను పసికట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. కరోనా ఉందన్నవిషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తంచుకొని వ్యవహరించాలని అధికారులు చెబుతూ వస్తున్నారు.

ఏది ఏమైనా ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా కళ తప్పిన పండుగల జాబితాలో దీపావళి కూడా చేరిపోయింది. ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కావడంతో వీలైనంత జాగ్రత్తలు పాటించి, కాలుష్య రహితంగా దీపావళిని జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కృష్టి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories