Viral News: పాము కక్కిన గుడ్లను తీసుకొచ్చి పొదిగించారు.. ఏం పిల్లలు పుట్టాయో తెల్సా..?

Snake Spits Bird Eggs in Tamil Nadu, Hatch in Incubator A Rare Wonder
x

Viral News: పాము కక్కిన గుడ్లను తీసుకొచ్చి పొదిగించారు.. ఏం పిల్లలు పుట్టాయో తెల్సా..?

Highlights

Viral News: తమిళనాడులో ఓ విస్మయకరమైన ఘటన చోటుచేసుకుంది. పాము కడుపులో నుంచి బయటపడ్డ గుడ్లు, ఇంక్యుబేటర్‌లో పొదిగిన తర్వాత పిట్ట పిల్లలుగా మారాయి.

Viral News: తమిళనాడులో ఓ విస్మయకరమైన ఘటన చోటుచేసుకుంది. పాము కడుపులో నుంచి బయటపడ్డ గుడ్లు, ఇంక్యుబేటర్‌లో పొదిగిన తర్వాత పిట్ట పిల్లలుగా మారాయి. ఈ అసాధారణ సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.

జూలై 27న తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో నాగుపాము కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పామును రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పాము ఏకంగా ఏడు గుడ్లను కక్కేసింది. మొదట వాటి మూలం ఎవరికీ అర్థం కాలేదు.

గుడ్లను పగలకపోవడంతో, వాటిని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ మనోహరన్‌కి అప్పగించారు. ఆయన పరిశీలించగా అవి కోడి గుడ్లు కాకుండా కౌజు పిట్ట గుడ్లని గుర్తించారు. రెస్క్యూ చేసే కొద్దిసేపటి ముందు పాము పక్షి గూడును దాడి చేసి, ఆ గుడ్లను మింగి ఉండొచ్చని ఆయన తెలిపారు.

ఆ గుడ్లలో జీవం ఉందేమోనన్న అనుమానంతో, వాటిని ఇంక్యుబేటర్‌లో ఉంచి పొదిగించడం ప్రారంభించారు. వారం రోజులకు ఆశ్చర్యకరమైన ఫలితం వెలుగుచూసింది — ఏడు గుడ్లలో నాలుగు గుడ్ల నుంచి పిట్ట పిల్లలు పుట్టాయి.

పాము కడుపు నుంచి బయటపడి, మళ్లీ జీవం పొందిన ఆ పిట్ట పిల్లలను చూసి అందరూ విస్మయంతో తిలకిస్తున్నారు. “ఇది నిజంగా ప్రకృతి అద్భుతం. ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories