Viral Video: బెడ్‌ కింది నుంచి ఏదో శబ్ధం.. ఏంటా అని పరుపు తీసి చూడగా షాక్‌..!

Viral Video: వర్షకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న పాములు బయటకు వస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 July 2024 7:31 PM IST
Snake Moves Under the Mattress Video Goes Viral in Social Media
X

Viral Video: బెడ్‌ కింది నుంచి ఏదో శబ్ధం.. ఏంటా అని పరుపు తీసి చూడగా షాక్‌..!

Viral Video: వర్షకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న పాములు బయటకు వస్తాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు ఒక్కొక్కటి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఒకప్పుడు ఇంట్లో పాము కనిపిస్తే వెంటనే పాములు పట్టే వారిని పిలిపించి పట్టించేవారు, లేదా కర్రతో చంపేసేవారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో పాము కనిపించిన వెంటనే చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తీసి కెమెరాలో బంధిస్తున్నారు. ఈ వీడియోలను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి. స్కూటర్లు, హెల్మెట్స్‌, కార్లు ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తి మంచం మీద ఉన్న బెడ్‌ను నెమ్మదిగా పక్కకి జరిపాడు. ఇందలోనే ఓ పరుపు కింది నుంచి నాగు పాము నెమ్మదిగా కదులుతుంది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

బెడ్ కింద పాము ఉన్న విషయాన్ని గుర్తించిన యజమాని స్నేక్‌ క్యాచర్‌ను పిలిపించినట్లు ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. దీంతో వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారికి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. పాము కింద ఉండగా, బెడ్‌పై పడుకోవడం ఊహించుకుంటేనే షాకింగ్‌గా ఉంది కదూ! ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 లక్షలకుపైగా మంది వీక్షించారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story