Viral Video: పెద్దాయన పంచెలోకి దూరిన నాగుపాము.. ఆ తర్వాత ఏమైందంటే..?

Viral Video: సోషల్‌ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా వైరల్‌ అవుతుంటాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Nov 2024 3:29 PM IST
Snake Enter Into Old Man Legs Video Goes Viral in Social Media
X

Viral Video: పెద్దాయన పంచెలోకి దూరిన నాగుపాము.. ఆ తర్వాత ఏమైందంటే..?

Viral Video: సోషల్‌ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా వైరల్‌ అవుతుంటాయి. నిత్యం ఎన్నో వీడియోలు నెటిజన్లను పలకరిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఓ పెద్దాయన పొలం గట్టు వద్ద సరదాగా కూర్చున్నాడు. అయితే అంతలోనే వెనకాల నుంచి ఓ పెద్ద నాగుపాము అటుగా వచ్చింది. అంతటితో ఆగకుండా ఆ ముసలాయన కాళ్ల కిందుగా వెళ్లింది. దీనంతటినీ వెనకాల నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే పంచలోకి జారుకున్న తర్వా ఏమైందన్న విషయం తెలియలేదు. పాము కాళ్ల కిందికి వెళ్లగానే వీడియో అక్కడితోనే ఎండ్ అయ్యింది. మరి అప్పటికైనా పాము వచ్చినట్లు ఆ పెద్దాయనకు తెలిసిందో లేదో. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరాల కామెంట్స్‌ చేస్తున్నారు. వెనకాల నుంచి వీడియో తీసే బదులు ఆ పెద్దాయనను అలర్ట్ చేయొచ్చు కదా.! అని కొందరు కామెంట్‌ చేయగా.. మరికొందరు మాత్రం ఇదేదో కావాలనే షుట్‌ చేసిన వీడియో అనిపిస్తోందంటూ రాసుకొచ్చారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story