Cobra Snake Dance Video: నడి రోడ్డుపై మైకెల్ జాక్సన్ స్టైల్లో నాగుపాము డ్యాన్స్.. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్..!

Snake Dance Video Goes Viral on Social Media
x

Cobra Snake Dance Video: నడి రోడ్డుపై మైకెల్ జాక్సన్ స్టైల్లో నాగుపాము డ్యాన్స్.. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్..!

Highlights

Cobra Snake Dance Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాముల వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Cobra Snake Dance Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాముల వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు పాముల వెరైటీ వీడియోలను ఆసక్తిగా చూస్తూ కామెంట్లతో నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు… పాముల బెడద పెరగడం సహజమే. దీనికోసం ఇంటి చుట్టూ చెత్త, పొదలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా పాములు కనిపిస్తే చాలామంది స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇస్తారు. అయితే మరికొందరు వాటిపై శాడిజం చూపిస్తూ, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల పాములు సెల్‌ఫోన్‌లో 'నాగినీ' పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పాములకు చెవులు ఉండవన్న సంగతి తెలిసిందే. అయితే, మనుషుల అడుగుల ధ్వనితో ఏర్పడే తరంగాలు వాటి శరీరాన్ని తాకినప్పుడు, పాములు అక్కడి నుంచి తొలగిపోతుంటాయి. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక పాము నడి రోడ్డుపైన మైమరిచి, అచ్చం మైకెల్ జాక్సన్‌ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ కనపించింది. పాము చేసే అల్లరి చూసి, అక్కడినుంచి వెళ్లేవాళ్లు షాక్‌తో చూస్తూ ఉండిపోయారు.

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, నెటిజన్లు 'ఈ పాము స్టెప్పులు భలే వేసిందిగా!' అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు 'డేంజరస్ అయినా డ్యాన్స్ అందంగా ఉంది' అంటూ రెస్పాండ్ అవుతున్నారు.

వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. పాము కనిపించినట్లయితే వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వండి అని నిపుణులు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories