Viral Video: స్లాబ్ వేస్తుండగా ఊహించని పరిణామం.. షాకింగ్‌ వీడియో..!

Viral Video: స్లాబ్ వేస్తుండగా ఊహించని పరిణామం.. షాకింగ్‌ వీడియో..!
x
Highlights

Viral Video: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెబుతుంటారు. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇంటికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో.

Viral Video: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెబుతుంటారు. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇంటికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో. అందుకే ఇంటి నిర్మాణం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అయితే ఇలాంటి ఇంటి నిర్మాణం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇల్లు నిర్మించే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది.

ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ సమయంలో ఇంటి పైభాగంలో కాంక్రీట్ స్లాబ్‌ వేస్తున్నారు. అక్కడున్న కార్మికులు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సిమెంట్‌ కాంక్రీట్‌ను మిషిన్‌ సహాయంతో స్లాబ్‌పై సిమెంట్‌ వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కార్మికులు పనిచేస్తున్న స్లాబ్‌ క్షణంలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. మొత్తం సిమెంట్‌, కంకరా కింద పడిపోయింది.

అయితే వెంటనే అలర్ట్‌ అయిన కార్మికులు భయంతో అక్కడే ఉన్న ఇనుప కడ్డీలను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇదంతా అక్కడే ఉన్న వారు ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాణ్యత లేమి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్లాబ్‌కి సపోర్ట్‌గా పెట్టిన కర్రలు నాణ్యత లేవని అర్థమవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇలాంటివి జరుగుతాయంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా, నిజంగా ఈ కార్మికులు చాలా అదృష్టవంతులు ఎక్కడో సుడి ఉంది అందుకే ప్రమాదం నుంచి బయటపడ్డారు అంటూ మరొకరు స్పందించారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరి ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories