గొర్రెల కాపరి ఇంటర్నెట్‌లో స్టార్‌గా ఎదిగాడు...

గొర్రెల కాపరి ఇంటర్నెట్‌లో స్టార్‌గా ఎదిగాడు...
x
Highlights

సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కొక్కరు తమ టాలెంట్ ని చూపించుకుంటూన్నారు. ఆ టాలెంట్ ని జనాలు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక డబ్‌స్మాష్,...

సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కొక్కరు తమ టాలెంట్ ని చూపించుకుంటూన్నారు. ఆ టాలెంట్ ని జనాలు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక డబ్‌స్మాష్, టిక్‌టాక్‌లు వచ్చిన తరవాత అయితే ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలుగా మారినా వల్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. తాజాగా ఓ గొర్రెల కాపరి తన టాలెంట్ ని చూపించుకొని ఇంటర్నెట్‌లో స్టార్‌గా ఎదిగాడు. ఇక వివరాల్లోకి వెళ్తే 1994లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని 'హే మౌసమ్ కా జాదు హై మిత్వా' పాటలో 'ఇన్కో హమ్ లే కే చలే హై, అప్నే సాంగ్ అప్నీ నగరియా' అంటూ సాగే రిలిక్‌కు ఆ గొర్రెల కాపరి సరిగ్గా లిప్ ని సింక్ చేసాడు. ఇందులో అతడు పలికించిన హవాభావాలకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల వ్యూస్ మరియు కామెంట్లతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories