Viral Video: రెప్పపాటులో తప్పిన గండం.. వీడియో చూస్తే నరాలు కట్ అవ్వాల్సిందే..!

Viral Video: ప్రతీరోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిలో మన తప్పు లేకుండా జరిగేవి కొన్ని అయితే తెలిసి మరీ మనం చేసే తప్పులు మరికొన్ని.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 July 2024 12:11 PM IST
School Kid Just Missed Accident by Truck Video Goes Viral in Social Media
X

Viral Video: రెప్పపాటులో తప్పిన గండం.. వీడియో చూస్తే నరాలు కట్ అవ్వాల్సిందే..!

Viral Video: ప్రతీరోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిలో మన తప్పు లేకుండా జరిగేవి కొన్ని అయితే తెలిసి మరీ మనం చేసే తప్పులు మరికొన్ని. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అందుకే చెబుతుంటారు. ఇక చిన్న తనం నుంచి పాఠ్యాంశాల్లో కూడా రోడ్డు భద్రతకు సంబంధించి పాఠాలు బోధిస్తుంటారు. రోడ్డు దాటే ముందే అటు, ఇటు చూడాలని ఇలాంటి ఎన్నో నిబంధనలను వివరిస్తుంటారు. అయితే వీటిని పాటించకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఇలాంటి ఓ పొరపాటుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడో జరిగిందో తెలియదు కానీ. చూస్తుంటే మాత్రం ప్రాణం అరచేతిలో పెట్టుకున్న భావన కలగకమానదు. ఈ వీడియో విషయానికొస్తే ఇద్దరు చిన్నారులు స్కూల్ బస్‌ దిగిన తర్వాత రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అప్పటికే వాళ్లు దిగిన బస్సు రోడ్డుపై ఉండడంతో అవతలి వైపు నుంచి ఏదైనా వాహనం వస్తున్న విషయాన్ని చిన్నారులు గుర్తించలేకపోయారు. దీంతో వేగంగా రోడ్డును దాటేందుకు ముందుకొచ్చారు.

అయితే అప్పటికే అటువైపు నుంచి ఒక పెద్ద ట్రక్‌ వేగంగా దూసుకొస్తోంది. దీంతో ఆ ట్రక్కు ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. అయితే ట్రక్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా అప్రమత్తమై బ్రేక్‌ వేశాడు. దీంతో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. ట్రక్‌కి ఉన్న ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ చిన్నారి జీవితాన్ని కాపాడింది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కచ్చితంగా ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story