Samsung Galaxy Z Fold 2 5G: శామ్‌సంగ్‌ నుండి మడత పెట్టే 5G స్మార్ట్‌ఫోన్.. ‌ధ‌ర ఎంతో తెలుసా..!

Samsung Galaxy Z Fold 2 5G: శామ్‌సంగ్‌ నుండి మడత పెట్టే 5G స్మార్ట్‌ఫోన్.. ‌ధ‌ర ఎంతో తెలుసా..!
x
Highlights

Samsung Galaxy Z Fold 2 5G: స్మార్ట్‌ఫోన్ల శకానికి నాంధి.. సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే హై ఎండ్ ఫీచర్లతో కూడిన నూత‌న‌ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. అదే గెలాక్సీ జెడ్ ఫోల్డ్2 5జీ.

Samsung Galaxy Z Fold 2 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ల శకానికి నాంధి.. సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే హై ఎండ్ ఫీచర్లతో కూడిన నూత‌న‌ ఫోల్డబుల్ (మడత పెట్టే) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. అదే గెలాక్సీ జెడ్ ఫోల్డ్2 5జీ. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్‌ను ఈ నెల 14 (సోమవారం) నుంచి సాంసంగ్ ప్రారంభించనుంది. 5జీ టెక్నాలజీతో కూడిన ఈ ఫోల్డబుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1.49,999గా నిర్ణయించారు. వినియోగదారులు సాంసంగ్ వెబ్‌సైట్ లేదా ప్రముఖ ఈ-కామర్స్(ఆన్‌లైన్) స్టోర్స్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

6.2 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ కవర్ డిస్‌ప్లే‌తో కూడిన మల్టీ టాస్కింగ్ ఫ్లీచర్లతో దీన్ని తయారు చేశారు. నాలుగు నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అలాగే ఈ ఫోన్‌ను కొన్నవారికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 22 శాతం తగ్గింపు లభిస్తుంది. 12 నెలల పాటు నో-కాస్ట్ ఇఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. మిస్టిక్ బ్లాక్‌, మిస్టిక్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

గతంలో భారత మార్కెట్‌లోకి తెచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు భారీ సక్సస్ అయ్యాయని...గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్2 5జీ స్మార్ట్ ఫోన్‌కి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని సాంసంగ్ ఎస్‌డబ్ల్యూఏ ప్రెసిడెంట్, సీఈవో కెన్ కాంగ్ ఓ ప్రకటనలో ధీమా వ్యక్తంచేశారు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫీచర్లు

- 7.6అంగుళాల క్యూఎక్స్‌జీఏ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే

- 1768 x 2208 పిక్సెల్స్ రిజల్యూషన్‌,

- 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ ఫ్లెక్స్ కవర్ డిస్‌ప్లే

- 816 x 2260 పిక్సెల్స్ రిజల్యూషన్‌

- స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్‌

- 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ/ 512జీబీ స్టోరేజ్

- 12+12+12 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా

- 10+10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

Show Full Article
Print Article
Next Story
More Stories