Top
logo

Samsung Galaxy F41: స‌మ్‌సాంగ్ నుంచి త‌క్కువ ధ‌ర‌లోనే.. అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌

Samsung Galaxy F41: స‌మ్‌సాంగ్ నుంచి త‌క్కువ ధ‌ర‌లోనే.. అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌
X

Samsung Galaxy F41

Highlights

Samsung Galaxy F41: స్మార్ట్ ఫోన్ల‌ దిగ్గ‌జం సామ్‌సంగ్.. భార‌త మార్కెట్ లోకి వ‌రుస‌గా త‌న ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా ఎఫ్ సిరీస్‌లో మ‌రో ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే సామ్‌సంగ్ ఎఫ్ 41.

Samsung Galaxy F41: స్మార్ట్ ఫోన్ల‌ దిగ్గ‌జం సామ్‌సంగ్.. భార‌త మార్కెట్ లోకి వ‌రుస‌గా త‌న ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా ఎఫ్ సిరీస్‌లో మ‌రో ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే సామ్‌సంగ్ ఎఫ్ 41. ఈ ఫోన్ 64 మెగా ఫిక్స‌ల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్ర‌త్యేక ప్యూచ‌ర్ల‌తో ఆక‌ర్షించ‌నున్న‌ది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

వాటి ప్రకారం.. ఈ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో రానున్న‌ది. ఇందులో సామ్‌సంగ్ ఈజీన్స్ 9611 ప్రాసెసర్ ను ఉప‌యోగించారు. గ్రాఫిక్స్ అవసరాల కోసం మేయిల్ - జీ72 ఎంపీ3 జీపీయూ లభిస్తుందని తెలుస్తోంది.

అలాగే.. 6జీపీ ర్యామ్ + 64 జీపీ , 6జీపీ ర్యామ్ + 128జీపీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన 2 మోడల్స్ లో అందుబాటులోకి రానున్నాయి. మెమరీ కార్డు ద్వారా 512 GB వరకూ అదనంగా స్టోరేజ్ పొందే అవకాశం ఈ ఫోన్ లో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే వ‌న్ యూఐ యూజర్ ఇంటర్ ఫేస్ ఈ ఫోన్లో ఉంటుంది.

ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్, మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. అలాగే సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 32 మెగా ఫిక్స‌ల్ సెల్ఫీ కెమెరా అమ‌ర్చ‌బ‌డి ఉంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, అద్భుతమైన సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అలాగే 4 జీ వీఓఎల్‌టీఈ రెండు సిమ్ కార్డుల సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 5 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది.

ఈ ఫోన్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ బ్యాట‌రీ. ఇందులో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఫోన్ వేగంగా ఛార్జింగ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇన్ని అదిరిపోయే ప్యూచ‌ర్లు ఉన్నా ఈ ఫోన్ త‌క్కువ బ‌డ్జెట్‌లోనే రానున్న‌ది. అది కూడా 15 వేల రూపాయల ధరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో గానీ, అక్టోబర్ మొదటి వారంలో గానీ భారతీయ మార్కెట్లో అందుబాటులో రానున్న‌ది.

Web TitleSamsung Galaxy F41 price, specifications, features and more
Next Story