Viral Video: వామ్మో.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలా ఉంటుందా? భయపెట్టిస్తోన్న వీడియో..!

Viral Video: వామ్మో.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలా ఉంటుందా? భయపెట్టిస్తోన్న వీడియో

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Aug 2024 10:31 AM IST
Road collapse in huge flood water video goes viral in social media
X

Viral Video: వామ్మో.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలా ఉంటుందా? భయపెట్టిస్తోన్న వీడియో

Viral Video: ప్రకృతి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. పచ్చని చెట్లు, సెలయేరులు, చిరు జల్లులు ఇలా ఎంతో అద్భుతంగా ఉండే ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం తట్టుకోవడం మానవునితో కాదు. మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగినా ప్రకృతి ముందు మాత్రం ఏం చేయలేడు. ప్రకృతి సృష్టించిన బీభత్సాలకు సంబంధించిన ఎన్నో సంఘటనలు ఇప్పటి వరకు చూశాం. మొన్నటిమొన్న కేరళలో ప్రకృతి ఎంతటి భయానక పరిస్థితి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొండచరియలు విరిగిపడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ప్రకృతి ప్రకోపిస్తే ఇంత దారుణంగా ఉంటుందా.? అనే విధంగా ఉందా వీడియో. వివరాల్లోకి వెళితే.. కొండ ప్రాంతంలోని ఓ రోడ్డు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంది.

ఆ రోడ్డుకు అవతలి వైపు సొరంగ మార్గం ఉంది. ఆ రోడ్డు కింది నుంచే ఓ వాగు వ్రహిస్తోంది. అయితే ఇదే సమయంలో వాగులో నీరు ఉదృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో రోడ్డు ఉన్నట్లుండి ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రోడ్డుకు రెండు వైపులా ఉన్న వాళ్లు అలాగే ఉండిపోయారు. దీనంతటినీ తన స్మార్ట్‌ ఫోన్‌లో బంధించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ హాని జరగలేదని వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. వామ్మో ఇలా రోడ్లకు రోడ్లు కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి.? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తంమీద ప్రకృతి కాపాడుకోవాల్సిన అవసరం గురించి ఈ వీడియో స్పష్టం చేస్తోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story