Viral Video: అప్పుడే గుడ్డులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కింగ్ కోబ్రా ఎలా ఉంటుందో చూశారా?

Viral Video
x

Viral Video: అప్పుడే గుడ్డులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కింగ్ కోబ్రా ఎలా ఉంటుందో చూశారా?

Highlights

Viral Video: పాము అంటేనే గుండెలో జ‌ల్లుమంటుంది. కానీ పాముల‌ను చూడ‌డానికి, వాటి గురించి తెలుసుకోవ‌డానికి ఎంత‌గానో ఆస‌క్తి చూపిస్తుంటాం. అందుకే సోష‌ల్ మీడియాలో సైతం పాముల‌కు సంబంధించిన వీడియోలు కుప్ప‌లుతెప్ప‌లుగా ఉంటాయి.

Viral Video: పాము అంటేనే గుండెలో జ‌ల్లుమంటుంది. కానీ పాముల‌ను చూడ‌డానికి, వాటి గురించి తెలుసుకోవ‌డానికి ఎంత‌గానో ఆస‌క్తి చూపిస్తుంటాం. అందుకే సోష‌ల్ మీడియాలో సైతం పాముల‌కు సంబంధించిన వీడియోలు కుప్ప‌లుతెప్ప‌లుగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటుంది.

పాముల్లో అత్యంత విష‌పూరిత‌మైన పాముల్లో కింగ్ కోబ్రా ఒక‌టని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పామును చూస్తే భ‌యం వేస్తుంది. కింగ్ కోబ్రా గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిస్తుంది. ఒకే సారి 10 నుంచి 30 గుడ్ల వరకు ఉంచే సామర్థ్యం కింగ్ కోబ్రాకు ఉంటుంది. ఇవి తమ గుడ్ల‌ను రక్షించేందుకు ఇతరులకు కనిపించని భద్రమైన ప్రదేశాల్లో ఉంచుతాయి.

గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడానికి సాధారణంగా 60 నుంచి 80 రోజులు పడుతుంది. గుడ్ల నుంచి బయటపడిన కొద్దిసేపటికే ఈ పాములు 20–30 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఇవి పుట్టిన క్షణాల నుంచి విషంతో పుట్టే పాములు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం, కింగ్ కోబ్రా పిల్లల విషం శక్తివంతంగా అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది.

కింగ్ కోబ్రాలు పుట్టిన వెంటనే స్వతంత్రంగా జీవిస్తాయి. తాము వేటాడే జీవులను గుర్తించుకోవడం, వాటిని చాకచక్యంగా పట్టు కోవడం వంటి నైపుణ్యాలను వాటంత‌ట‌వే నేర్చుకుంటాయి. ఇలాంటి ఎన్నో విశేషాలున్న కింగ్ కోబ్రా పుట్టిన వెంట‌నే ఎలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా.?

దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పాము డబ్బాలో నుంచి బయటకు వస్తోంది. దాన్ని ఒక వ్యక్తి దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తే, అది బుసలు కొడుతూ విరుచుకుపడేలా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ‌య‌సున్న పామే అయినా బుస‌లు కొడుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Show Full Article
Print Article
Next Story
More Stories