Rakhi Special 2023: రాఖీ స్పెషల్‌.. మీ సోదరికి ఈ ప్రత్యేక బహుమతులు అందిస్తే అంతులేని ఆనందం..!

Rakhi Special 2023: ఈ ఏడాది ఆగస్టు 30న రాఖీ పండుగ వస్తోంది. సోదరీ-సోదరుల బంధాన్ని బలపరిచే ఈ పండుగను భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు.

Jyothi
Published on: 31 Aug 2023 7:15 AM IST
Raksha Bandhan 2023 Giving these Gifts to your Sister will bring endless happiness
X

Rakhi Special 2023: రాఖీ స్పెషల్‌.. మీ సోదరికి ఈ ప్రత్యేక బహుమతులు అందిస్తే అంతులేని ఆనందం..!

Rakhi Special 2023: ఈ ఏడాది ఆగస్టు 30న రాఖీ పండుగ వస్తోంది. సోదరీ-సోదరుల బంధాన్ని బలపరిచే ఈ పండుగను భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు సోదరులకి రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తారు. రాఖీ కట్టినందుకు సోదరులు వారికి బహుమతులు అందిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా సోదరికి రాఖీ కానుకలు ఇచ్చే ట్రెండ్ బాగా పెరిగింది. చిటికెలో బహుమతి ఇచ్చి ముఖంలో చిరునవ్వుని కోరుకుంటారు. ఈసారి మీ సోదరికి ఇలాంటి ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఆనందింపజేయండి.

స్వీయ రక్షణ

ప్రతి సోదరుడు తన సోదరికి ఆపదలో ఆదుకుంటానని వాగ్ధానం చేస్తాడు. ఇందుకోసం ఆమెని ఆత్మరక్షణ తరగతులలో చేర్పించండి. అంటే కరాటే లాంటివాటిలో శిక్షణ ఇప్పించండి. ఆమె మీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. తన భద్రతని మరింత మెరుగ్గా చూసుకోగలుగుతుంది.

స్మార్ట్ వాచ్

ఒకప్పుడు అన్నదమ్ములు రాఖీ కట్టినందుకు అక్కా చెల్లెళ్లకు డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆధునిక యుగంలో బహుమతి ప్రత్యేకంగా ఉండటం ముఖ్యం. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా సోదరికి స్మార్ట్ వాచ్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఆరోగ్యం నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ల వరకు అన్ని ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి.

యోగా మ్యాట్

సోదరి ఆరోగ్యం పట్ల సీరియస్‌గా ఉన్నట్లయితే ఆమెకు యోగా మ్యాట్‌ను బహుమతిగా అందించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చిరకాలం ఉంటుంది.

పుస్తక బహుమతి

మీ సోదరికి చదవడం అంటే ఇష్టం ఉంటే ఆమెకు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఆమెకి ఇష్టమైన బుక్‌ తెచ్చి మరింత సంతోషించేలా చేయండి.

Jyothi

Jyothi

Next Story