Viral Video: కొండచిలువ వింత ప్రవర్తన.. భారీ జంతువును మింగి వాంతి చేసిన షాకింగ్ వీడియో

Viral Video: కొండచిలువ వింత ప్రవర్తన.. భారీ జంతువును మింగి వాంతి చేసిన షాకింగ్ వీడియో
x

Viral Video: కొండచిలువ వింత ప్రవర్తన.. భారీ జంతువును మింగి వాంతి చేసిన షాకింగ్ వీడియో

Highlights

Viral Video: భారీ కొండచిలువ ఒక పెద్ద జంతువును మింగి తిరిగి వాంతి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ అరుదైన ఘటన నెట్టింట చర్చకు దారి తీస్తోంది.

Viral Video:భారీ కొండచిలువ ఒక పెద్ద జంతువును మింగి, ఆ తర్వాత వాంతి చేసుకుంటున్న అరుదైన దృశ్యం కెమెరాలో నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపిస్తున్న కొండచిలువ, తన కడుపులో ఉన్న భారీ ఆహారాన్ని నెమ్మదిగా బయటకు పంపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కొండచిలువలు మింగిన ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవి మింగిన ఆహారాన్ని తిరిగి వాంతి చేసుకుంటాయి.

నిపుణుల వివరాల ప్రకారం, తమ శరీర పరిమాణాన్ని మించిన జంతువులను మింగినప్పుడు, ప్రమాద పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా ఆహారం విషపూరితంగా ఉన్నప్పుడు కొండచిలువలు ఈ విధంగా స్పందిస్తాయి. అలాగే, ఆహారం మింగిన వెంటనే అవి డిస్టర్బ్ అయినా వాంతి చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఘటనను ఒక వ్యక్తి జంతువుల సమీపంలోకి వెళ్లి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకృతి లోకంలోని అరుదైన దృశ్యాలను చూపిస్తుండటంతో, నెట్టింట ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. కొండచిలువ మింగిన జంతువు ఏదన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అది పిల్లి అని చెబుతుండగా, మరికొందరు పిట్‌బుల్ జాతికి చెందిన శునకమని అభిప్రాయపడుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories