తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు చూస్తే అర్ధమవుతుందని, ఒకే ఒక...
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు చూస్తే అర్ధమవుతుందని, ఒకే ఒక వ్యక్తిలా కనిపిస్తూ ఒక వ్యవస్థలా స్వార్ధాలకు దూరంగా రేయింబవళ్లు ప్రతిభతో కష్టిస్తున్న పురాణపండ శ్రీనివాస్ శ్రమసౌందర్యం చూస్తే తెలుస్తోందని, ఒక అసాధారణ వక్త అయి కూడా ఈ సమాజంలోని అసూయలకు, ద్వేషాలకు దూరంగా ఉంటూ వంద సభలకు ఆహ్వానిస్తే ఒక పది సభలకు మాత్రమే హాజరయ్యే పురాణపండ శ్రీనివాస్ పనిచేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని రవీంద్రభారతి, త్యాగరాయగానసభలలో ఇటీవల జరిగిన కొన్ని సభలకు విచ్చేసిన విఖ్యాత సాహితీవేత్తలు కొలకలూరి ఇనాక్, వోలేటి పార్వతీశం, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.వి. రమణాచారి, కిషన్ రావు వంటి ప్రముఖులు, వంశీ రామ రాజు, కళా జనార్ధన మూర్తి వంటి సాంస్కృతిక రంగ ప్రముఖులు, మురళీమోహన్, తనికెళ్ళ భరణి వంటి సినీ పెద్దలు సభాముఖంగా పేర్కొనడం గమనార్హం.
ఈ కోణం లోంచి చూసినప్పుడు జూబిలీ హిల్స్‌లో కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం విశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపూర్వ రచనా సంకలనం ‘శ్రీ మాలిక’ నాలుగు వందల పేజీల మహా గ్రంధం ఎంతోమంది పెద్దల్ని ఆకట్టుకుంటోంది. పవిత్ర సంచలనం సృష్టిస్తోందని మన కన్నుల ముందే స్పష్టమవుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం జూబిలీ హిల్స్ ఏఈవో రమేష్ టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకి స్వయంగా శ్రీమాలిక అందించడమే కాకుండా పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న కృషిని వివరంగా చెప్పడాన్ని ఇక్కడ పేర్కొనాలి.
మరొక వైపు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడా బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో పాల్గొంటున్న వేల వేల భక్తుల ఆనందానికి అవధుల్లేవు.
నాలుగు మాడవీధుల్లో కోలాటాలు, ప్రత్యేక నృత్యాలు, వివిధ పౌరాణిక వేష ధారణలు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు, గోవింద నామాల ధ్వనుల మధ్య శ్రీవారు మలయప్ప స్వామిగా వివిధ అద్భుత అలంకరణలతో వివిధ అవతారాలతో జేగీయమానంగా సాగుతుంటే వెనుకనే భక్తులు ఆనందాలతో సాగుతున్నారు.
ఈ పవిత్ర కార్యాలలో ఉదయ సాయంకాల వేళల్లో శ్రీవారి సేవలో ఉన్న శ్రీవారి సేవాభక్తులు, తిరుమల అధికారులు సంయుక్తంగా పురాణపండ శ్రీనివాస్ బుక్స్‌ని వితరణ చేస్తుండటం గమనార్హం.
తిరుమల అధికారుల, అర్చకుల సూచనలతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌చే ఇంత మహా గ్రంధాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో.. బ్రహ్మోత్సవాలకు ముందే మూడు వేల గ్రంధాలను జూబిలీ హిల్స్‌లో కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించిన ప్రఖ్యాత వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య పై పలువురు దాతలు, ప్రముఖులు ప్రశంసలు వర్షిస్తున్నారు.
గత రెండు దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి వేదపాఠశాల లగాయతు తిరుపతి వేదవిశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం, తిరుపతి అడ్మినిస్ట్రేషన్ విభాగాల వరకూ వేల కొలది ఉద్యోగుల వరకూ అరవై శాతం వారు పారాయణ చేసేది పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలనేననని సాక్షాత్తూ గత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఇప్పటి ప్రధాన అర్చకులు వేణు గోపాల దీక్షితులు ముక్తకంఠంతో చెప్పడం అత్యంత ప్రాధాన్యకరమైన అంశంగానే చెప్పాలి.
ఎంతోమంది కోట్లాది రూపాయలూ, సువర్ణ ఆభరణాలూ శ్రీవారికి సమర్పిస్తారేగానీ ఇలా ఒక పరమ అఖండమైన శ్రీమాలిక వంటి ఎంతో ప్రయోజనకరమైన ఉత్తమ గ్రంధాన్ని సమర్పించాలని ఆలోచన వచ్చిన బొల్లినేనికి కృష్ణయ్యను శ్రీవారి పరమ భక్తులైన హర్ష టయోటా. పెన్నా సిమెంట్, జీవీకే గ్రూప్ వంటి భారీ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు అభినందించాయి. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు శ్రీమాలిక బుక్‌ను ఇవ్వడం సరిక్రొత్త పవిత్ర ప్రయోగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాలలో ఇలా ఒక చక్కని పుస్తకాన్ని సమర్పించడం ఆషామాషీ వ్యవహారం కాదని, కేవలం తిరుమల నారాయణుని అనుగ్రహమేనని బొల్లినేని కృష్ణయ్యకు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి ఈ అరుదైన అవకాశం దొరకడం పూర్వ జన్మ సుకృతమే!
తన వారైనా, ఎంతటి వారైనా వికృత మనస్తత్వాలతో తేడాలు పలికితే అస్సలు రాజీ పడకుండా సంచరించే పురాణపండ శ్రీనివాస్ అటువంటి మూర్ఖులతో తెగ తెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడరని అనేకసందర్భాలలో స్పష్టమైనది. ఒక గొప్ప రచయితగా, సంకలనకర్తగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో చక్కని కీర్తి గడించిన రాజీ పడని మనస్తత్వమ్‌గా పేరుపొందిన పురాణపండ శ్రీనివాస్ జీవన ప్రయాణంలో ఎన్నో కష్టాలెదుర్కొన్న ఉద్విగ్న సమయంలో సాక్షాత్తూ వేంకటేశ్వరుడే తన అభయ హస్తంతో ప్రక్కన ఉండి అద్భుతాలు చేయిస్తున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. బొల్లినేని కృష్ణయ్య సంస్థతో సుమారు పదిహేడేళ్ల సుదీర్ఘ ధార్మిక జీవన ప్రయాణం సాగిస్తున్న పురాణపండ శ్రీనివాస్‌కు ఇదొక అనుభూతికాక తప్పదు.
రాజకీయ యోధుడిగా నెల్లూరు, నెల్లూరు గ్రామీణ ప్రాంతాలతో విడదీయలేని బంధం కలిగిన మాజీ మంత్రి, హైదరాబాద్ కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ఎన్నో వైద్య కళాశాలలు, వైద్యాలయాలు, నెల్లూరు జిల్లాలలోని ఆత్మకూరు ప్రాంతాల హరిజన వాడల్లో పలు ఆలయాలు నిర్మించిన బొల్లినేని కృష్ణయ్య తన ఇలవేల్పు తిరుమల వేంకటేశ్వరుడు కావడంతో ఆయన శ్రీనివాస్‌తో కలిసి ఈ అద్భుత కార్యాన్ని పవిత్ర సేవగా అందించారని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కోట్లాది భక్తులున్న హైదరాబాద్ వంటి మహా నగరంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రయివేట్ వ్యక్తి , పారిశ్రామిక రంగ ప్రముఖుడు కృష్ణయ్యకు ఈ అరుదైన అవకాశందక్కడం అదృష్టమేనని సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆలయ అధికారుల నుండి ఆహ్వాన పత్రికతో పాటు శ్రీమాలిక బుక్‌ను అందుకుంటూ పేర్కొనడం మేలిమలుపుగా చెప్పక తప్పదు. ఆ సమయంలో భువనేశ్వరి కూర్చున్న కుర్చీ ఎదురుగా ఉన్న టేబుల్ పై పురాణపండ శ్రీనివాస్ అఖండ మహా అఖండ గ్రంధం నేనున్నాను (ఐదు వందల ఆంజనేయులు వర్ణ చిత్రాల, అరుదైన శిల్పాల మంత్ర శక్తుల, హనుమత్కథల మొట్టమొదటి మహాగ్రంధం) మీడియాకు దర్శనమివ్వడం విశేషం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



