Prevalence of Anxiety was Higher than Virus: కరోనా కంటే రెండడుగులు ముందున్న ఆందోళన.. పరిశోధనలో వెల్లడి

Prevalence of Anxiety was Higher than Virus: కరోనా కంటే రెండడుగులు ముందున్న ఆందోళన.. పరిశోధనలో వెల్లడి
x
prevalence of anxiety was higher than virus
Highlights

Prevalence of Anxiety was Higher than Virus: నిజంగా కరోనా కంటే అది సోకుతుందేమో... సోకిందేమో... అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తోంది.

Prevalence of Anxiety was Higher than Virus: నిజంగా కరోనా కంటే అది సోకుతుందేమో... సోకిందేమో... అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడికైనా బయటకు వెళితే వైరస్ తనకు సోకిందేమో... ఇది కుటుంబ సభ్యులందరికీ విస్తరిస్తుందేమో అనే భయం వెంటాడుతూనే ఉంది. అయితే దీనిపై మేధావులు, ప్రముఖ వైద్యులు, ప్రభుత్వాలు రోజుకో మాట, పూటకో మాట చెబుతుండటంతో్ ఈ ఆందోళన మరింత విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి గురించి ఎక్కడా ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని చెప్పాలి. ఇది తీవ్రమైతే వైరస్ సోకముందే మరణించే ప్రమాదముందని మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనిని కట్టడి చేయాలంటే భయపడకుండా జాగ్రత్త వహించాలని పలువురు సూచిస్తున్నారు.

ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి జరిగిందా.. లేదా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. నిపుణులు మాత్రం వైరస్‌ వ్యాప్తికంటే.. ఆందోళన మాత్రం సామాజిక వ్యాప్తి పక్కాగా జరిగిందని చెబుతున్నారు. ఇటీవలే అమెరికన్‌ సైకియాట్రిస్ట్‌ అసోసియేషన్‌ దీనిపై పరిశీలన జరిపింది. ఈ అసోసియేషన్‌తో పాటు బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ పరిశోధన చేశారు. తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తి కంటే.. ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇంతకీ వాళ్లు చెప్పిన విషయాలు ఏమిటంటే..

► కరోనా సోకిన వారికంటే తమకూ సోకుతుందేమోనన్న అనుమానంతో ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు.

► ఒక విధంగా ఈ ఆందోళన, భయం, స్ట్రెస్‌ వంటివి సామాజిక వ్యాప్తి జరిగినట్టు చెప్పుకోవచ్చు.

► అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నారు.

► పాశ్చాత్య దేశాల కంటే ఆసియా దేశాల్లో ఇలాంటి ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

► యువకుల్లోనూ ఇలాంటి ఆందోళన ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.

► ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉన్న వృద్ధులు కూడా వెంటనే కోలుకుంటున్నారు.

► యాంగ్జైటీ లేకపోతే రక్తంలో ఆక్సిజన్‌ నిల్వలు నిలకడగా ఉంటాయి. కరోనా వార్తలు వినకుండా మిగతా వ్యాపకాల్లో ఉండటమే దీనికి సరైన మందు.

Show Full Article
Print Article
Next Story
More Stories