అమెజాన్‌లో ఆర్డర్ పెట్టిన రెండేళ్లకు డెలివరీ.. కస్టమర్ ఏం చేశాడంటే..

అమెజాన్‌లో ఆర్డర్ పెట్టిన రెండేళ్లకు డెలివరీ.. కస్టమర్ ఏం చేశాడంటే..
x
Highlights

Pressure Cooker Delivered After Two Years: రెండేళ్ల క్రితం మీరు అమేజాన్‌లో క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఇప్పుడు ఉన్నట్లుండి మీ తలుపు తడితే మీ రియాక్షన్ ఎలా...

Pressure Cooker Delivered After Two Years: రెండేళ్ల క్రితం మీరు అమేజాన్‌లో క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఇప్పుడు ఉన్నట్లుండి మీ తలుపు తడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ? హా.. అలా ఎందుకు జరుగుతుందిలే అని కొట్టిపారేస్తున్నారా ? కానీ జే అనే వ్యక్తికి ఈ వింత అనుభవం నిజంగానే ఎదురైంది. జే 2022 అక్టోబర్‌లో ప్రెస్టీజ్ కుక్కర్ కోసం అమేజాన్‌లో ఆర్డర్ పెట్టారు. ఆ తరువాత ఎందుకో కానీ మనసు మార్చుకున్న జే వెంటనే ఆ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేశారు. జే ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో అమేజాన్ కంపెనీ వాళ్లు అతడికి ఇవ్వాల్సిన డబ్బుని రిఫండ్ చేశారు. అంతటితో ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ కథ అయిపోయందనుకున్నారు జే. కానీ విచిత్రంగా ఈ ఏడాది ఆగస్టు 28న అమేజాన్ డెలివరి బాయ్ వచ్చి తలుపు తట్టారు. అమేజాన్ నుండి ఆర్డర్ వచ్చిందని డెలివరి బాయ్ ఇచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి చూసి ఖంగుతినడం జే వంతయ్యింది. అమేజాన్ పంపించిన ఆ పార్సిల్లో కుక్కర్ ఉంది.

ఇదే విషయాన్ని మరునాడు జే ఎక్స్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నారు. రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ చేసినందుకు థాంక్యూ అమేజాన్ అంటూ ఆ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. రెండేళ్లపాటు వేచిచూసేలా చేసిన తరువాత వచ్చిన కుక్కర్ కనుక ఇది బాగా స్పెషల్ అయ్యుండొచ్చని సెటైర్ వేశారు. కుక్కర్‌ని చూసి వంట చేసే వాళ్లు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారని జే ట్వీట్ చేశారు. జే ఇచ్చిన రియాక్షన్ చూసి అమేజాన్ కూడా అంతే అవాక్కయింది. అయితే, ఇది తరచుగా జరిగే పొరపాట్లలో ఒకటిగా భావించిన అమేజాన్.. ఎప్పటిలానే జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతూ రిప్లై ఇచ్చింది. ఈ విషయాన్ని తమ సపోర్ట్ టీమ్‌ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అమేజాన్ రిప్లై ఇచ్చింది.

జే మాత్రం గాడిద గుడ్డేం కాదన్నట్లుగా రియాక్ట్ అయ్యారు. తాను క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌కి మీరు డబ్బులు రిఫండ్ కూడా ఇచ్చేశారు. " ఇప్పుడు మీరు కుక్కర్ పంపిస్తే నేనేందుకు డబ్బులు కట్టాలి " అని అమేజాన్‌ని తిరిగి ప్రశ్నించారు.

జే పోస్ట్ చేసిన ట్వీట్ నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజెన్స్ తమదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ రిప్లై ఇచ్చారు. బహుషా అది వేరే గ్రహం నుండి వచ్చినట్లుంది. అందుకే డెలివరికి రెండేళ్లు పట్టింది అని కొంతమంది జోక్ చేశారు. ఇంకొంతమందేమో.. బహుషా ఇది జే కోసమే సెపరేటుగా చేయించారేమో అని సెటైర్లు వేశారు. అంత లక్కీ కుక్కర్‌ని ఎందుకు వద్దనుకుంటున్నావు అని జే ని ప్రశ్నించిన వాళ్లు కూడా లేకపోలేదు. మొత్తానికి ఆర్డర్ పెట్టిన రెండేళ్ల తరువాత కుక్కర్ డెలివరి చేసిన అమేజాన్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories