Photo puzzle: ఈ ఫోటోలో ఒక తప్పు ఉంది.. అదేంటో గుర్తు పట్టగలరా.?

Photo puzzle: ఈ తప్పును 10 సెకండ్లలో కనిపెట్టాలి. మరెందుకు ఆలస్యం ఓసారి ప్రయత్నించండి.

Photo puzzle can you find there is a mistake in this photo
X

Photo puzzle: ఈ ఫోటోలో ఒక తప్పు ఉంది.. అదేంటో గుర్తు పట్టగలరా.?

Photo puzzle: బ్రెయిన్ టీజర్లు మన ఆలోచన శక్తిని పెంచుతాయి. ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్తాయి. వీటినే ఫోటో పజిల్స్ గా పిలిస్తుంటారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కంటి చూపును పరీక్షించే ఇలాంటి ఫోటోలకు ఉండే క్రేజే వేరు. అలాంటి ఫోటోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫోటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పైన ఉన్న ఫోటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ఇద్దరు పిల్లలు గార్డెన్ లో ఫార్మింగ్ చేస్తున్నట్లు ఉంది కదూ. అక్కడే చెట్లు, అందమైన ప్రకృతి కనిపిస్తోంది. అయితే ఇందులో ఓ తప్పు ఉంది అదేంటో కనిపెట్టడమే ఈ ఫోటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఆ తప్పు ఏంటో గుర్తు పట్టారా.? అయితే ఆ తప్పును గుర్తుపట్టడం అంత సులభమైన విషయం కాదు. చూడ్డానికి సాధారణంగా కనిపిస్తున్నా ఫోటోలో పెద్ద తప్పే ఉంది.

ఈ తప్పును 10 సెకండ్లలో కనిపెట్టాలి. మరెందుకు ఆలస్యం ఓసారి ప్రయత్నించండి. చూశారా.. తప్పును కనిపెట్టారా.? ఓసారి ఫోటోను జాగ్రత్తగా కనిపిస్తే తప్పును ఇట్టే కనిపెట్టేయ్యొచ్చు. ఎంత ప్రయత్నించినా తప్పును కనిపెట్టలేక పోతున్నారా.? అయితే ఓసారి.. ఫోటోలో పిల్లలు నాటుతోన్న మొక్కలను జాగ్రత్తగా గమనించండి అందులో అప్పటికే పండిన ఒక అరటి పండు ఉంది. పండిన అరటి పండుకు నీరు పోయడమే ఈ ఫోటోలో ఉన్న తప్పు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story