Optical Illusion: చెత్త డబ్బ గాల్లో ఎలా తేలుతోంది.? అసలు విషయం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Optical Illusion: వినేదే కాదు, కంటితో చూసేదంతా కూడా నిజం కాదని చెబుతుంటారు.

Optical Illusion This Photo Looks Like Dustbin in Air, But Real Fact Will Surprise You
X

Optical Illusion: చెత్త డబ్బ గాల్లో ఎలా తేలుతోంది.? అసలు విషయం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Optical Illusion: వినేదే కాదు, కంటితో చూసేదంతా కూడా నిజం కాదని చెబుతుంటారు. కొన్ని రకాల విజువల్స్‌ను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అయితే గ్రాఫిక్స్‌లో రూపొందించిన ఫొటోలు మాత్రమే కాకుండా సహజ ఫొటోలు కూడా ఇలాంటి భ్రమనే కలిగిస్తాయి. చూసే కళ్లను సైతం మోసం చేస్తుంటాయి. అలాంటి ఫొటోలనే ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలుగా చెబుతుంటారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

సహజంగా క్లిక్‌ మనిపించే ఫొటోలు సైతం చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. అసలు విషయం తెలిసే వరకు అందులోని అర్థం తెలియదు. అలాంటి ఓ ఫొటోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.


పైన కనిపిస్తున్న ఫొటోచూడగానే ఏం అనిపిస్తోంది. ఒక చెత్త డబ్బ గాల్లో తేలుతున్నట్లు ఉంది కదూ! ఆ చెత్త డబ్బ నిడ కింద కనిపిస్తుండడంలో డబ్బ గాల్లో తేలుతున్న భావన మనకు కలుగుతుంది. అయితే నిజానికి ఆ చెత్త డబ్బా గాల్లో తేలడం లేదు. అక్కడే కనిపించేది నీడ కూడా కాదు. టైల్స్‌పై నిలిచిన నీరు మనకు నీడ రూపంలో కనిపిస్తోంది. దీంతో డబ్బా సహజంగానే గాల్లో తేలుతున్న భావన కలుగుతోంది. ఇది ఈ చెత్త డబ్బ గాల్లో తేలుతున్నట్లు కనిపించడం వెనకాల ఉన్న అసలు రీజన్‌.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story