Optical Illusion: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో ఏం కనిపిస్తుందో చెప్పండి

Optical illusion In Telugu: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఒక ఫొటోను చూపించి దాని ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతున్నారు. అలాంటి ఓ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Sept 2024 7:18 PM IST
Optical illusion In Telugu
X

Optical illusion

Optical illusion In Telugu: మనం ఎలాంటి వాళ్లమో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇది సర్వసాధరణ. మన ఆలోచనలు ఎలా ఉంటాయి.? మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని ఇష్టపడుతుంటారు. అయితే ఇది కేవలం మానసిక నిపుణులకు మాత్రమే సాధ్యమనే భావనలో ఉంటాం. కొన్ని రకాల వస్తువులను చూపించి వాటిని మనం చూసే విధానం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమో చెబుతుంటారు.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఒక ఫొటోను చూపించి దాని ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతున్నారు. అలాంటి ఓ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు వస్తువులు దాగి ఉన్నాయి. ఒకటి మొసలి కాగా, రెండోది పడవ. ఈ ఫొటో చూడగానే మీకు మొదట ఏం కనిపిస్తుందన్న దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..

* ఒకవేళ మీకు ఈ ఫొటో చూడగానే మొదట మొసలి కనిపిస్తే మీరు చాలా లిబరల్‌గా ఆలోచించే వ్యక్తి అని అర్థం. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. మీరు ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే పెద్దగా రిస్క్‌లు తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. రిస్క్‌ లేకుండా జీవితాన్ని సాఫీగా నడిపించాలననే ఆలోచనతో ఉంటారు.

* ఈ ఫొటో చూడగానే మీకు ఒకవేళ పడవ కనిపిస్తే.. మీరు చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెడుతుంటారు. అందరు ఆలోచించే విధంగా కాకుండా సరికొత్తగా ఆలోచిస్తారు. ప్రపంచాన్ని భిన్నమైన కోణంలో చూస్తారని అర్థం. నలుగురు ఆలోచించే విధానంలో కాకుండా సరికొత్తగా ఆలోచిస్తుంటారు. గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తుంటారు.




హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story