Optical Illusion: మీ ఐ పవర్‌కి ఓ పరీక్ష.. ఇందులో 'W' కనిపెడితే మీరు సూపర్‌ అంతే..!

Optical Illusion: మీ ఐ పవర్‌కి ఓ పరీక్ష.. ఇందులో 'W' కనిపెడితే మీరు సూపర్‌ అంతే..

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 July 2024 9:39 AM IST
Optical illusion Can you Find W letter among these M letters in this photo
X

Optical Illusion: మీ ఐ పవర్‌కి ఓ పరీక్ష.. ఇందులో 'W' కనిపెడితే మీరు సూపర్‌ అంతే.. 

Optical Illusion: ఆప్లికల్‌ ఇల్యూజన్ ఫొటోలు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇలాంటి ఫొటోలను సాల్వ్ చేయడంలో భలే కిక్కు ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఇటాంటి ఫొటోలకు భలే క్రేజ్‌ ఉంది. నెటిజన్లు రెట్టించిన ఉత్సాహంతో వీటిని సాల్వ్‌ చేయడానికి ఇష్టపడుతుంటారు.

దీంతో సోషల్‌ మీడియాలో పలువురు ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. చూసే కళ్లను మాయ చేస్తూ, మెదడును గజిబిజీకి గురి చేసే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రతీ రోజు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటో ఏంటి.? ఇందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిసిస్తోంది. ఏముంది 'M' అనే ఇంగ్లిష్‌ లెటర్‌ ఉందని అంటారు. కదూ! అయితే వీటి నడుమ 'W' అనే లెటర్‌ కూడా దాగి ఉంది. దీన్ని కనిపెట్టడమే ఈ టాస్క్‌ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 10 సెకండ్లలో మీరు ఈ టాస్క్‌ను సాల్వ్‌ చేస్తే మీ ఐ పవర్‌ సూపర్‌ అని అర్థం. మరి మీరు ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలరేమో ఓసారి ట్రై చేయండి. ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయాలంటే మీ బ్రెయిన్‌ షార్ప్‌నెస్‌తో పాటు, కంటి చూపు కూడా పర్‌ఫెక్ట్‌గా ఉండాలి.

ఇంతకీ మీరు పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? 'W' అక్షరాన్ని గుర్తుపట్టారా.? ఎంత ప్రయత్నించిన సమాధానం లభించకపోతే ఓసారి మూడో లైన్‌ను బాగా గమనించండి సమాధానం అందులోనే ఉంది. మీరు చాలాసేపటి నుంచి వెతుకుతున్న 'W' లెటర్‌ మూడో లైన్‌లో మిడిల్‌లో ఉంది. ఇంత చెప్పినా సమాధానం దొరక్కపోతే మాత్రం ఓసారి కింద ఫొటో చూడండి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story