Optical Illusion: మీ కంటి చూపులో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 3 నెంబర్‌ కనిపెట్టగలరా..!

Optical Illusion: ఫొటో పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2024 5:51 PM IST
Optical Illusion Can you Find There is 3 Number Among These 6 Numbers
X

Optical Illusion: మీ కంటి చూపులో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 3 నెంబర్‌ కనిపెట్టగలరా..!

Optical Illusion: ఫొటో పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి వాటిని చేధించే క్రమంలో మన ఆలోచన శక్తితో పాటు ఐ పవర్‌ను కూడా పరీక్షిస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్‌ ఎక్కువగా మ్యాగజైన్స్‌లో కనిపించేవి. కానీ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పజిల్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఫొటో పజిల్స్‌ పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లో ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ ఇలాంటి ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే సహజంగా 8 నెంబర్‌ కనిపిస్తోంది కదూ! అయితే ఇదే ఫొటోలో 3 నెంబర్‌ కూడా దాగి ఉంది. ఆ నెంబర్‌ను గుర్తించడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పజిల్‌ను కేవలం 10 సెకండ్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. అలా అయితేనే మీ ఐ పవర్‌ సూపర్‌ అని అర్థం.

ఇంతకీ ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా లేదా.? ఎంత ప్రయత్నించినా సమాధానం లభించడం లేదా.? అయితే ఓసారి పై నుంచి 8వ లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అదే లైన్‌లో 3వ నెంబర్‌ కనిపిస్తుంది. ఇంత ప్రయత్నించినా నెంబర్‌ కనిపించలేదా.? అయితే సమాధానం కోసం కింద ఫొటోను చూసేయండి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story