OPPO A15 Smartphone Diwali Offer: పదివేల లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలా? అయితే..ఇది చూడండి!

OPPO A15 Smartphone Diwali Offer: ఒప్పో పదివేల రూపాయల్లో బడ్జెట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది.

K V D Varma
Published on: 10 Nov 2020 11:45 AM IST
OPPO A15 Smartphone Diwali Offer: పదివేల లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలా? అయితే..ఇది చూడండి!
X

OPPO A15 Smartphone Diwali Offer : స్మార్ట్ ఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. అయితే, బడ్జెట్ అనుకూలించదు. బడ్జెట్ తక్కువలో ఫోన్ కొన్నా అంతగా అది పనిచేయదు. ముఖ్యంగా రామ్ తక్కువ ఉండే ఫోనులే తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి. అయితే, ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో యిప్పుడు తక్కువ బడ్జెట్ లో అందరికీ అందుబాటులో ఉండేలా దీపావళి కానుకగా మంచి ఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన ఒప్పో దానిలోనే ఇంకొంచెం తక్కువలో రెండో వేరియంట్ విడుదల చేసింది.

ఏ15 స్మార్ట్‌ఫోన్ మొదటి వేరియంట్ 3 జీబీ + 32 జీబీ ఫోన్ మార్కెట్లో ఉంది. దీని ధర 9,990 రూపాయలు. ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువ ధరలో 2జీబీ+32జీబీ వేరియంట్‌లో కొత్త మోడల్‌ని పరిచయం చేస్తోంది ఒప్పో. ఈ ఫోన్ ధర 9,490 రూపాయలు. ఇక ఈ ఫోన్ ఇప్పుడు రిటైల్ మార్కెట్ తో పాటు.. అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు చూస్తె.. 7.9ఎంఎం సైజ్‌లో ఉండే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇది. 6.52 అంగుళాల వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్‌డీ+ రెజల్యూషనల్, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ చిప్‌సెట్ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో చురల్ బ్యూటీ, ఏఐ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్, త్రీ ఫింగర్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఒప్పో ఏ15 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే

ర్యామ్: 2జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35

రియర్ కెమెరా: 13మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

ఫ్రంట్ కెమెరా: 5మెగాపిక్సెల్

బ్యాటరీ: 4230ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 7.2 + ఆండ్రాయిడ్ 10

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: డైనమిక్ బ్లాక్, మిస్టరీ బ్లూ

ధర: రూ.9,440


K V D Varma

K V D Varma

Next Story