శివ భక్తులను ఓలలాడిస్తున్న 'ఓం భం భోలే'.. అకీ క్రియేటివ్ వర్క్స్ నుంచి మరో సూపర్ హిట్ భక్తి ఆల్బమ్!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సంగీత ప్రియులను అలరించేందుకు 'అకీ క్రియేటివ్ వర్క్స్' సరికొత్త భక్తిరస గీతాన్ని ప్రేక్షకుల...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సంగీత ప్రియులను అలరించేందుకు 'అకీ క్రియేటివ్ వర్క్స్' సరికొత్త భక్తిరస గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. గతంలో 'ఏమి మాయ ప్రేమలోన' వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యానర్, తాజాగా రూపొందించిన 'ఓం భం భోలే' మ్యూజిక్ ఆల్బమ్ శివ భక్తుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
ఈ పాటలో నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, మరియు అజాస్ జాన్ శివ భక్తులుగా నటించారు. వారి ఆహార్యం, అభినయం పరమశివుని పట్ల భక్తి భావాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఈ పాటను ఒక దృశ్యకావ్యంగా మలిచాయి. నాగేంద్ర ఇనమడుగు ఈ ఆల్బమ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
అనిల్ ఇనుమడుగు ఈ పాటకు దర్శకత్వం వహించడమే కాకుండా, శివుని గొప్పతనాన్ని వివరిస్తూ లోతైన సాహిత్యాన్ని అందించారు. మార్క్ ప్రశాంత్ అందించిన బాణీలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆయన స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. సినిమాటోగ్రఫీ చరణ్ పన్నాల అందించిన విజువల్స్ భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాట, ప్రతి శివ భక్తుడి ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. మహాశివరాత్రి వేళ ఈ పాట శివాలయాల్లోనూ, ఆధ్యాత్మిక వేడుకల్లోనూ మార్మోగుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



