Viral Video: ఫస్ట్ టైమ్‌ పిజ్జా టేస్ట్ చేసిన 70 ఏళ్ల ముసలమ్మ..! ఎక్స్‌ ప్రెషన్స్‌ చూస్తే నవ్వేస్తారు..

Viral Video: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాపులర్‌ అయిపోతున్నారు

hmtv Digital Team
Updated on: 9 Nov 2021 8:46 PM IST
Old Woman who Tasted Pizza for the First Time Viral Video
X

పిజ్జా తింటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ముసలమ్మ వైరల్ వీడియో

Viral Video: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాపులర్‌ అయిపోతున్నారు. తమ టాలెంట్‌ని బయటపెట్టి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అంతేకాక ఫన్నీ వీడియోలు, హాస్య వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ వాటిని వైరల్‌గా చేస్తున్నారు. తాజాగా ఒక డెబ్బై ఏళ్ల ముసలమ్మ పిజ్జా తిన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. షేర్స్‌, కామెంట్స్, లైక్‌ చేస్తూ అదరగొడుతున్నారు. ఆ వీడియో సంగతి ఏంటో మనం తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఒక గదిలో ఇద్దరు వృద్దురాలు ఒక పిజ్జా బాక్స్‌ని ఓపెన్ చేయడం మనం చూడవచ్చు. తర్వాత అందులో నుంచి ఒక బైట్‌ తీసిన ఒక వృద్దురాలు మరో ముసలావిడకు ఇస్తుంది. దానిని తీసుకున్న ఆ డెబ్బై ఏళ్ల ముసలమ్మ వింతగా చూస్తూ మెల్లిగా నోట్లో పెట్టుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు. పిజ్జా టేస్ట్ చేసిన ఆ ముసలమ్మ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. నవ్వకుండా ఉండలేకపోతున్నారు. 'వాటే ముసలి' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను ఇరవై వేలకు మందికి పైగా చూశారు.

అయితే వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఒక యూజర్ దానిపై వ్యాఖ్యానిస్తూ ముసలమ్మ పిజ్జా రుచిని ఇష్టపడలేదని అనిపిస్తుందన్నాడు. మరొక వినియోగదారు ఇలా రాశాడు 'పిజ్జా తింటున్నప్పుడు ముసలమ్మ వ్యక్తీకరణ చాలా ఫన్నీగా ఉందన్నాడు. చాలా క్యూట్‌గా అభివర్ణించాడు. ఏది ఏమైనా వీడియోలో ముసలమ్మ ఇచ్చిన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి జనాలు ఫిదా అవుతున్నారు. మరికొందరు ఈ సుందరిని కలవాలని తమ కోరికను వ్యక్తం చేశారు. మొత్తంమీద ఈ క్యూట్ మూమెంట్ సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story