Old Wine: కోట్ల వర్షం కురిపించిన వైన్ బాటిల్.. అందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Old Wine Bottle: తాజాగా 50 ఏళ్ల నాటి మద్యాన్ని ఓ వ్యక్తి లక్షలకు విక్రయించడంతో.. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతే కాదు ఈ మద్యం బాటిల్‌ను వేలం వేసి..

Jyothi
Updated on: 28 May 2023 7:30 PM IST
Old Wine Bottle Gave Rs 87 Lakhs in Auction in us
X

Old Wine: కోట్ల వర్షం కురిపించిన వైన్ బాటిల్.. అందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Old Wine Bottle: వైన్‌ను ఇష్టపడే వ్యక్తులు వివిధ బ్రాండ్‌లను ఇష్టపడుతుంటారు. పాత వైన్‌ను ఇష్టపడే వారు కొందరు ఉంటే, కొంతమంది ఎప్పుడూ కొత్త ట్రెండ్‌లను ట్రై చేసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా ఓల్డ్ వైన్ తాగేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే, పాత వైన్ చాలా ఖరీదుగా ఉండడంతో చాలామంది అది ఓ కలగానే భావిస్తుంటారు. అవకాశం వస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం కూడా చేయరు. అంటే పాత వైన్‌ను అంతలా ఆస్వాదిస్తుంటారన్నమాట. అయితే, తాజాగా 50 ఏళ్ల నాటి మద్యాన్ని ఓ వ్యక్తి లక్షలకు విక్రయించడంతో.. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతే కాదు ఈ మద్యం బాటిల్‌ను వేలం వేసి, కోట్లు సంపాదించాడు.

ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఇక్కడ నివసించే మార్క్ పాల్సన్ అనే వ్యక్తి వద్ద 50 ఏళ్ల నాటి మద్యం బాటిల్ ఉంది. ఈ వ్యక్తి ఈ మద్యాన్ని 1970లలో కొన్నాడు. అది ఇప్పటికీ అతని వద్దే ఉంది. ఒక రోజు ఈ వ్యక్తి వేలం హౌస్‌కి వెళ్లి తన వద్ద 50 ఏళ్ల నాటి వైన్ బాటిల్ ఉందని, అది ఎప్పుడూ తెరవలేదని, ఇంకా మూసే ఉందని చెప్పాడు.

ఆ తర్వాత, ఈ మద్యం బాటిల్‌ను త్వరగా తీసుకురావాలని వేలం సంస్థ అతనిని కోరింది. ఆ వ్యక్తి మద్యం సీసాతో అక్కడికి చేరుకున్నాడు. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, మద్యం బాటిల్ లక్ష డాలర్లకు పైగా అమ్ముడైందంట. అంటే, ఈ మొత్తం భారతీయ రూపాయలలో 87 లక్షల రూపాయలకు పైగా ఉందంట.

మద్యం సీసా ఇంత ధరకు అమ్ముడవుతుందని ఈ వ్యక్తి ఊహించలేదు. నివేదిక ప్రకారం, ఈ వ్యక్తి ఒక కళాకారుడు. చాలా కాలం క్రితం పాతకాలపు వైన్ పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ మద్యం బాటిల్ లా టాచే అనే బ్రాండ్‌కు చెందినదని చెబుతున్నారు. ఇది చాలా అసాధారణమైన వైన్‌గా పరిగణిస్తుంటారు.

Jyothi

Jyothi

Next Story