కనబడకుండా పోయిన ఫోన్ 70% ఛార్జింగ్‌తో దొరికింది..

కనబడకుండా పోయిన ఫోన్ 70% ఛార్జింగ్‌తో దొరికింది..
x
Highlights

ఈ రోజుల్లో ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి తమ ఫోన్ అనుకోకుండా పోతే వారి బాధ వర్ణణాతీతం అనుకో.. అయితే 19 ఏండ్ల కిందటట పక్కకు పెట్టిన పాత ఫోన్ మళ్లీ అవుపిచ్చింది.

ఈ రోజుల్లో ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి తమ ఫోన్ అనుకోకుండా పోతే వారి బాధ వర్ణణాతీతం అనుకో.. అయితే 19 ఏండ్ల కిందటట పక్కకు పెట్టిన పాత ఫోన్ మళ్లీ అవుపిచ్చింది. అయితే విచిత్రం ఏమిటంటే.. చాలా కాలం అవుతోంది కదా.. ఫోన్ పనిచేయదు అని అనుకున్నాడు. ఒకసారి ఆన్ చేసి చూద్దాం అని ఆన్ చేశాడు.. వెంటనే ఆన్ అవ్వడంతో పాటు... ఫోన్ 70శాతం బ్యాటరీని చూపించింది. అంతే ఒక్కసారిగా అతడు ఆనందంతో ఎగిరి గంతేసాడు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్ లోని ఎలెస్ మియర్ పోర్ట్ సిటీలో కెవిన్ మూడీ అనే వ్యక్తికి ఎదురైంది. ఇంకేముంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్లితే ఇంగ్లండ్ లోని ఎలెస్ మియర్ పోర్ట్ సిటీలో కెవిన్ మూడీ అనే వ్యక్తి కన్ స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. అయితే అతడు ఎదో మరిచిపోయిన ఓ వస్తువు కోసం.. అతడు తన ఇంట్లో అంతాట వెతికాడు. ఓ టేబుల్ డ్రాలో.. మూలన నోకియా పాత మోడల్ 3310 మోడల్ ఫోన్ దొరికింది. అర్రే... ఈ ఫోన్ ఇంకా ఉందా అని తెగ సంబురపడ్డాడు. ఆలస్యం చేయ్యకుండా ఫోన్ ఆన్ చేశాడు.. వెంటనే ఆన్ అవ్వడంతో పాటు ఫోన్లో 70శాతం బ్యాటరీ ఉంది. అయితే 19 ఏళ్ల కిందట.. 2000 ఏడాదిలో ఈ ఫోన్ కొన్నానని.. అప్పట్లో ఈ ఫోన్‌ను తెగ ఉపయోగించేవాడిననీ.. ఇక ఎప్పుడైతే కొత్త ఫోన్లు వచ్చాయో అప్పటి నుండి దానిని పక్కన పెట్టినట్టు చెప్పాడు. కొన్నేళ్లనుంచి పూర్తిగా వాడటం మానేశానని చెప్పాడు. అయితే సిమ్ లేని ఆ ఫోన్ .. స్విచ్చాఫ్ కాకుండా 70శాతం చార్జింగ్ తో ఇంకా ఉండటం ఏంటీ అని.. ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. మరోసారి పాతఫోన్లు బ్యాటరీ విలువేంటో చెప్పిందన్నాడు కెవిన్. దీంతో తనకు ఎదురైన ఈ ముచ్చటని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories