Viral Video: MRI స్కాన్‌లో ఇదేం పని తాతయ్య.. ఏం చేశాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Viral Video: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Oct 2024 3:54 PM IST
Old Man Eating Gutka on MRI Scan Video Goes Viral in Social Media
X

Viral Video: MRI స్కాన్‌లో ఇదేం పని తాతయ్య.. ఏం చేశాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Viral Video: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి. నెట్టింట నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ పెద్దాయన చేసిన పనికి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెద్దాయన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో వైద్యులు అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ను చేయాలని సూచించారు. దీంతో స్కానింగ్ మిషిన్‌పై పడుకొబెట్టారు. వైద్యుడు వచ్చి స్కాన్‌ మిషిన్‌ లోపలికి పంపాల్సి ఉంది. దీంతో అప్పటి వరకు ఏం చేయాలనుకున్నాడో ఏమో కానీ.. ఆ పెద్దాయన వెంటనే జేబులో నుంచి ఎంచక్కా కైనీ ప్యాకెట్‌ను బయటకు తీశాడు.

కైనీ ప్యాకెట్‌ను ఓపెన్‌ చేసి చేతిలో వేసుకున్నాడు. అనంతరం దానిని మరో చేత్తో బాగా రుద్ది నోట్లో వేసుకున్నాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో కాస్త నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అలాంటివి తినడం వల్లే కదా తాత ఆసుపత్రికి వచ్చింది, అక్కడే కూడా అదే పనేనా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరైతే.. ఈ పెద్దాయన ధైర్యమేంటి అంటూ స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో నెటిజన్లను షాక్‌కి గురి చేస్తోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story