Naked man runs after boar: అడవి పంది వెనుక నగ్నంగా పరుగులు..ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు!

naked man runs after boar : ఒంటి మీద నూలుపోగు లేకుండా పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి అందరూ నవ్వుకున్నారు. అతను ఎందుకలా పరిగెట్టాడో మీరూ తెలుసుకోండి!

K V D Varma
Updated on: 19 Sept 2020 10:44 AM IST
Naked man runs after boar: అడవి పంది వెనుక నగ్నంగా పరుగులు..ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు!
X

naked-man-runs-after-boar-who-snatched-his-laptop-bag

అది జర్మనీ దేశం.. అక్కడి బెర్లిన్ లో టీఫెల్సీ అటవీ ప్రాంతంలోని డెవిల్స్ సరస్సు.. వారాంతంలో అక్కడ పర్యాటకులు విపరీతంగా వస్తారు. చాలా మంది అక్కడ సరస్సులో ఈతలు కొడుతున్నారు. మరికొంతమంది సరస్సు ఒడ్డున కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. సరస్సులోని ఓ వ్యక్తి పరుగులు తీస్తూ బయటకు వచ్చాడు. పరిగెత్తితే నవ్వుతారా అనుకోకండి... మరి అతని ఒంటి మీద నూలుపోగు కోడా లేదు. ఇంతకీ ఎందుకు అతను అలా పరుగు తీశాడో తెలిస్తే మీరూ నవ్వుతారు. ఒక అడవి పంది ఒడ్డున పెట్టిన అతని లాప్ టాప్ నోట కరుచుకుని పరుగులు తీసింది. దాని రెండు పిల్లలూ తల్లి వెంట పరిగెడుతున్నాయి. దాంతో తన లాప్ టాప్ ను తీసుకోవడం కోసం ఈత కొడుతున్న ఆ వ్యక్తి అలానే నగ్నంగా బయటకు వచ్చి పరుగులు తీశాడు. అదీ సంగతి. మొత్తమ్మీద తిప్పలు పడి ఆ పంది నుంచి తన లాప్ టాప్ కాపాడుకున్నాడు ఆ వ్యక్తి.

జరిగిందంతా అడిలె లాండార్ అనే నటి..కోచ్ ఫోటోలు తీసింది. ''అంతకు ముందు ఆ పంది అక్కడే ఉన్న ఒక వ్యక్తికీ చెందిన పిజ్జాలు లాక్కుంది. తరువాత ఈ లాప్ టాప్ బ్యాగ్ ను తీసుకుని పరుగులు తీసింది. వీటిని నేను ఫోటోలు తీశాను. మొత్తమ్మీద ఆ వ్యక్తి తన పసుపు పచ్చని లాప్ టాప్ బ్యాగ్ తీసుకుని వెనక్క్ వచ్చిన వెంటనే ఆ ఫోటోలు అతనికి చూపించాను. వాటిని చూసి అతను కూడా నవ్వుకున్నాడు.'' అంటూ చెప్పింది అడిలే. ఆ తరువాత ఆమె అతని అనుమతి తీసుకుని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ప్రాంతంలో అడవి పందుల సంచారం చాలా ఎక్కువ. అవి అక్కడికి వచ్చిన పర్యాటకులను తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.

K V D Varma

K V D Varma

Next Story