MySouthDiva 2026 Calendar: గ్లామర్ అండ్ గ్రేస్: ఘనంగా 'మైసౌత్‌దివా' 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.. 12 నెలలు, 12 మంది ముద్దుగుమ్మలు!

MySouthDiva 2026 Calendar: గ్లామర్ అండ్ గ్రేస్: ఘనంగా మైసౌత్‌దివా 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.. 12 నెలలు, 12 మంది ముద్దుగుమ్మలు!
x
Highlights

MySouthDiva 2026 Calendar: టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మైసౌత్‌దివా'...

MySouthDiva 2026 Calendar: టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మైసౌత్‌దివా' (MySouthDiva) తన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. మీడియా9 మరియు భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖుల సమక్షంలో జరిగింది.

నారీ శక్తికి నిదర్శనం.. క్యాలెండర్ హైలైట్స్

స్టైల్, మోడ్రన్ ఫ్యాషన్ మరియు నారీ శక్తిని ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. 12 నెలలకు గానూ 12 మంది ప్రముఖ నటీమణులను ఒక్కో థీమ్‌తో ఇందులో ప్రదర్శించారు.

ప్రముఖ నటీమణులు: శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్, మనస్వి మంగై, చాంద్సీ కటారియా, సాక్షి మ్హాడోల్కర్, సిమ్రత్ కౌర్, గెహ్నా సిప్పీ, రియా సుమన్, ఐశ్వర్య సాల్వి ఈ క్యాలెండర్‌లో మెరిశారు.

ముఖ్య అతిథులు: ఈ కార్యక్రమంలో నటీమణులు గెహ్నా సిప్పీ, ఉల్క గుప్తా తదితరులతో పాటు నిర్మాతలు రమేష్ పుప్పాల, శ్యాంసుందర్ నేతి, భారతి సిమెంట్స్ డీఎం రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.

ప్రతిభకు పట్టాభిషేకం: మనోజ్ కుమార్

మీడియా9 డైరెక్టర్ మరియు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. "అందం కంటే ఆత్మవిశ్వాసానికి, మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించాం. యువతులను ప్రేరేపించడమే మా లక్ష్యం" అని తెలిపారు. సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌లో అగ్రగామిగా ఉన్న మీడియా9, ఇప్పటికే 'ఫలక్‌నుమా దాస్' వంటి విజయవంతమైన చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories