Viral Video: ముంబైలో రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి వృద్ధుడిని కాపాడిన టీసీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

Viral Video: ముంబై లోకల్ రైళ్ల రద్దీ మధ్య కుర్లా రైల్వే స్టేషన్‌లో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది.

Arun Chilukuri
Published on: 12 Feb 2026 12:34 PM IST
Viral Video:  ముంబైలో రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి వృద్ధుడిని కాపాడిన టీసీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
X

Viral Video: ముంబైలో రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి వృద్ధుడిని కాపాడిన టీసీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

Viral Video: ముంబై లోకల్ రైళ్ల రద్దీ మధ్య కుర్లా రైల్వే స్టేషన్‌లో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే టికెట్ చెకర్ (TC) సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక వృద్ధుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. కదులుతున్న రైలు కింద పడబోతున్న ప్రయాణికుడిని టీసీ మెరుపు వేగంతో వెనక్కి లాగి ప్రాణాలు కాపాడారు.

అసలేం జరిగిందంటే?

థానే నుంచి CSMT వెళ్తున్న లోకల్ రైలు కుర్లా స్టేషన్‌లోకి ప్రవేశించింది. రైలు ఇంకా కదులుతుండగానే ఒక వృద్ధ ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో జనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆయన అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్‌ఫారమ్ - రైలుకు మధ్య ఉన్న సందులో జారిపడబోయాడు. సరిగ్గా అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న టీసీ పరిస్థితిని గమనించి, సెకన్ల వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు. తన శక్తినంతా ఉపయోగించి ఆ వృద్ధుడిని పట్టాలపైకి వెళ్లకుండా వెనక్కి లాగారు.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో టీసీ పరుగెత్తుకుంటూ వెళ్లి వృద్ధుడిని రక్షించడం స్పష్టంగా కనిపిస్తోంది. సమీపంలోని ఇతర ప్రయాణికులు స్పందించేలోపే టీసీ సాహసంతో ప్రాణాలు కాపాడారు. అనంతరం బాధిత వృద్ధుడికి రైల్వే సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.

టీసీ చేసిన సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "రైల్వే ఉద్యోగుల్లోని మానవత్వానికి, శిక్షణకు ఇది ఒక నిదర్శనం" అని నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ కదులుతున్న రైళ్ల నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేయవద్దని రైల్వే శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story