Monkey Video: ట్రైనర్‌కి గుణపాఠం నేర్పిన కోతి..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Monkey Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతాయి. నెటిజన్లు వీటిని తెగ ఎంజాయ్‌ చేస్తారు

hmtv Digital Team
Published on: 19 Oct 2021 3:11 PM IST
Monkey who hit his by Stick During Training Viral Video
X
మంకీ వైరల్ వీడియో (ట్విట్టర్ ఇమేజ్)

Monkey Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతాయి. నెటిజన్లు వీటిని తెగ ఎంజాయ్‌ చేస్తారు. అంతేకాదు లైక్స్‌, కామెంట్స్‌ చేస్తారు. తాజాగా నెట్టింట్లో ఓ కోతికి సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తుంది. వీడియోలో కోతి తన ట్రైనర్‌కి అనుకోని షాక్‌ ఇస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నవ్వుతున్నారు. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్‌ వీడియోలో ట్రైనర్ కోతికి శిక్షణ ఇవ్వడం మనం గమనించవచ్చు. కోతి ఒక స్టిక్‌ ఇచ్చి మెల్లగా తన తలపై కొట్టాలని సూచిస్తూ ఉంటాడు. మొదట రెండుసార్లు అలాగే చేసిన కోతి చివరి సారి మాత్రం గట్టిగా కొట్టడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో వీడియో చూస్తున్న నెటిజన్లు నవ్వు ఆపుకోవడం చాలా కష్టమవుతుంది.

అయితే వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా కామెంట్ చేశాడు. 'కోతి చేష్టలంటే ఇలాగే ఉంటాయి' అన్నాడు. మరొకరు 'ట్రైనర్‌కే ట్రైనింగ్‌ ఇస్తున్న కోతి' అన్నాడు. ఇంకొకరు 'కోతికి కర్ర ఇస్తే కొట్టకుండా ఏం చేస్తుంది' అని ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో నెటిజన్లు తెగ నవ్విస్తుంది. ఇప్పటివరకు ఈ ఫన్నీ వీడియోను 8 లక్షల మంది చూశారు. 21 వేలకు పైగా లైక్‌లు దాదాపు 3500 కామెంట్స్‌ చేశారు.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story